తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Hyderabad Rain Today : కుండపోత వర్షంతో భాగ్యనగరం అతలాకుతలం.. వరద నీటిలోనే పలు బస్తీలు

Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి స్థానికులు అవస్థలు పడుతున్నారు. జంట జలాశయాల్లోకి వరద పోటెత్తుతోంది. హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. బుధవారం భారీ వర్షాలకు అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది.

Hyderabad Rain Today
Hyderabad Rain Today

By

Published : Jul 25, 2023, 3:24 PM IST

Updated : Jul 25, 2023, 9:01 PM IST

కుండపోత వర్షంతో భాగ్యనగరం అతలాకుతలం.. వరద నీటిలోనే పలు బస్తీలు

Peoples Problems In Hyderabad Rain : హైదరాబాద్‌లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అంబర్‌పెటలోని బతుకమ్మ కుంట కాలనీ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరుతో పాటు పాములు రావడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమై వాటిని బంధించి తీసుకెళ్లారని స్థానికులు తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో వరద బీభత్సం సృష్టించింది. గాజుల రామారంలోని వొక్షిత్ ఎంక్లేవ్, ఆదర్శ నగర్, పలు కాలనీలు మళ్లీ నీట మునిగాయి.

రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్ కేసర్, పోచారం, మేడిపల్లిలలో వర్షపునీరు రహాదారుల ప్రవహించడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. దుండిగల్ , బాచుపల్లి నుంచి గండి మైసమ్మ వెళ్లే రహదారిపై వర్షపు నీరు చేరడంతో వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వికారాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి నదులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. తాండూర్, పరిగి నియోజకవర్గాల్లోని చెరువులు, ప్రాజెక్టులు నిండిపోయాయి.

నాంపల్లిలోని యూసుఫైన్ దర్గా లోపలికి వర్షపు నీరు రావడంతో భక్తులు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల నుంచి కోట్ల రూపాయలు విరాళాలు పొందుతూ కనీస వసతులు కల్పించకపోవడం దారుణమని మండిపడ్డారు. కొద్దిపాటి జల్లులతో మొదలైన వర్షం కుంభవృష్టిగా మారడంతో అంబేడ్కర్‌ నగర్‌లో వర్షంపు నీరు ఏరులై పారడంతో బస్తీ వాసులు భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్‌ రైల్‌ నిలయానికి ఎత్తైన ప్రాంతం నుంచి వరద రావడంతో గ్రౌండ్‌ ఫ్లొర్‌తో పాటు మొదటి రెండు అంతస్తుల్లోకి నీళ్లు చేరి ఎలక్ట్రానిక్‌ వస్తువులు తడిసయాని బాధితులు వాపోయారు.

Motorists problems To Hyderabad Rain : రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాలకు భారీ స్థాయిలో వరద నీరు పెరుగుతోంది. హిమాయత్‌సాగర్‌ జలాశయంలోకి 2000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో 4గేట్లు ఎత్తివేసి మూసినదిలోకి 2750 క్యూసెక్కుల నీటిని వదిలేశారు. నిన్న ఉదయం వరద తగ్గు ముఖం పట్టిందని ఊపిరి పీల్చుకున్న స్థానికులకు మరోసారి సాయంత్రం కురిసిన వర్షానికి వరద ఉద్ధృతి పెరిగింది.

దీంతో వరద నీటితో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఉదయం మోస్తారు వర్షం ప్రారంభం అవ్వడంతో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులకు, ఆఫీసులకు వెళ్లేందుకు ఉద్యోగులకు నానా అవస్థలు పాడ్పారు‌. ప్రతి సంవత్సరం ఇలాగే వరద ప్రభావం కొనసాగుతుందని దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోయారు. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు.

వికారాబాద్ జిల్లాలో నదులు, వాగులు వరదతో ఉరకలేస్తున్నాయి. వికారాబాద్, తాండూర్, పరిగి నియోజకవర్గాల్లోని చెరువులు, ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. కోటేపల్లి ప్రాజెక్టు దాదాపు పూర్తిస్థాయినీటి మట్టానికి చేరుకుంది. తాండూర్ సమీపంలోని కాగ్నా నది, యాలాల మండలం కొకట్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పరిగి పరిధిలోని లక్నాపూర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరుతోంది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 25, 2023, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details