Hyderabad Paraglider Dies in Sikkim: సిక్కింలో జరిగిన పారాగ్లైడింగ్ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువతి ప్రాణాలు కోల్పోయింది. బాధితురాల్ని ఖమ్మంకు చెందిన రామ్‌కుమార్ రెడ్డి కుమార్తె ఈశా రెడ్డి సంకెపల్లి(23)గా అధికారులు గుర్తించారు. సిక్కిం పర్యాటకానికి వెళ్లిన ఈశా.. శుక్రవారం ఉదయం లాఛుంగ్ వ్యూ పాయింట్ నుంచి పారాగ్లైండింగ్లో పాల్గొంది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన గాలులతో పారాచూట్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో బాధితురాలు కింద ఉన్న నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సిక్కింకు చెందిన పారాగ్లైడర్ సందీప్ గురుంగ్ (28) కూడా మరణించాడు.
పారాగ్లైడింగ్‌లో విషాదం.. తెలంగాణ యువతి మృతి - Paragliding accident in Sikkim
hyderabad paraglider Dies in sikkim: సిక్కింలో తెలంగాణకు చెందిన టూరిస్టు మృతి చెందింది. పారాచూట్ ప్రమాదంలో మరణించినట్లు అధికారులు తెలిపారు. బాధితురాల్ని ఖమ్మంకు చెందిన రామ్‌కుమార్ రెడ్డి కుమార్తె ఈశా రెడ్డి సంకెపల్లి(23)గా అధికారులు గుర్తించారు.
్ే
ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. నది వేగంగా ప్రవహిస్తున్న కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కూడా కష్టతరమైంది. మృతదేహాలు నది అడుగు భాగంలో బండల కింద చిక్కుకుపోయాయి. ఇండో-టిబెటన్ సరిహద్దు దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఎనిమిది గంటలు తీవ్రంగా శ్రమించి మృతదేహాలను వెలికితీశాయి.
ఇదీ చదవండి:ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య.. రాళ్లతో ముఖాలు ఛిద్రం..