Hyderabad Metro Green Line Full Details in Telugu: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆఫీసులకు వెళ్లేవారు, ఇతర పనులకు వెళ్లేవారితో రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. ప్రజలను ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించాలని తెలంగాణ ప్రభుత్వం మెట్రో తీసుకొచ్చింది. అయితే.. ఈ మెట్రోలో గ్రీన్, రెడ్, బ్లూ అంటూ.. లైన్లు ఉన్నాయి. ఈ స్టోరీలో గ్రీన్ లైన్ ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించింది..? ఏయే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది..? టికెట్ ధర ఎంత..? లాంటి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ అధికారికంగా 29 నవంబర్ 2017న ప్రారంభమైంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు.. దశలవారీగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మూడు లైన్లు పనిచేస్తున్నాయి. రెడ్ లైన్, బ్లూ లైన్, గ్రీన్ లైన్ ఉన్నాయి.
Hyderabad Metro Offers Today : జెండా పండుగ స్పెషల్ .. కేవలం రూ.59లకే మెట్రోలో భాగ్యనగరం చుట్టేయండి
- రెడ్ లైన్: రెడ్ లైన్.. మొదట అందుబాటులోకి వచ్చింది. ఇది మియాపూర్ నుంచి LB నగర్ వరకు సుమారు 29 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. ఈ లైన్‌లో అమీర్‌పేట్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్ వంటి ముఖ్యమైన స్థానాలతో సహా 27 స్టేషన్లు ఉన్నాయి.
- బ్లూ లైన్: బ్లూ లైన్.. హైదరాబాద్ మెట్రో రైలు రెండవ లైన్. ఇది నాగోల్ నుంచి రాయదుర్గం వరకు 28 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ లైన్ 23 స్టేషన్లను కలిగి ఉంది. ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్ వంటి ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతుంది.
- గ్రీన్ లైన్: గ్రీన్ లైన్ అనేది JBS (జూబ్లీ బస్ స్టేషన్), MGBS (మహాత్మా గాంధీ బస్ స్టేషన్) మధ్య నడిచే చిన్న లైన్. ఇది సుమారు 16.6 కిలోమీటర్ల దూరం, 9 స్టేషన్లను కలిగి ఉంది. గ్రీన్ లైన్ హైదరాబాద్ ప్రధాన బస్ టెర్మినల్స్ మధ్య కనెక్టివిటీని అందిస్తుంది.
వందే భారత్ 2.0!.. త్వరలోనే స్లీపర్, మెట్రో రైళ్లు.. వీటి స్పెషలేంటో తెలుసా?