బంగాల్ రాజధాని కోల్‌కతాలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన మృతదేహాం నగరంలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో పడి ఉంది. అయితే ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నోట్లో గ్యాస్ పైపులు..
పి. సమ్రిత్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం రీత్యా.. కోల్‌కతా, సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో తన సహోద్యోగులతో కలిసి నివసిస్తున్నారు. సోమవారం అతని మృతదేహాన్ని పోలీసులు అపార్ట్మెంట్లో గుర్తించారు. గ్యాస్ పైపులు నోట్లో, ముక్కులో ఉండగా.. ప్రాణాంతక వాయువు కారణంగా సమ్రిత్ మరణించారని భావిస్తున్నారు.
విశాఖపట్నం గ్యాస్ లీక్‌తో..