అత్తింట్లో వేధింపులు తట్టుకోలేక నిప్పు అంటించుకుని మంటల్లో కాలిపోతున్న భార్యను కాపాడాల్సింది పోయి.. ఆ దారుణాన్ని ఫోన్‌లో చిత్రీకరించి ఆమె కుటుంబ సభ్యులకు పంపిన ఓ రాక్షసుడి దురాగతమిది. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాకు చెందిన ఓ వివాహిత ఈ నెల 20న ఆత్మహత్య చేసుకోవడానికి నిప్పు అంటించుకుంది. ఒంటిని మంటలు దహించివేస్తుంటే బాధను ఓర్చుకోలేక కేకలు పెడుతున్నా అక్కడే ఉన్న భర్త కాపాడే ప్రయత్నం చేయలేదు సరికదా ఆ దృశ్యాన్ని ఫోన్‌లో చిత్రీకరించాడు.
కాలిపోతున్న భార్యను కాపాడకుండా వీడియో తీసిన భర్త! - రాజస్థాన్ క్రైమ్ న్యూస్
బలవన్మరణానికి పాల్పడి ఒంటికి నిప్పంటించుకున్న భార్యను రక్షించాల్సిందిపోయి.. ఆమె కేకలు పెడుతున్న దృశ్యాలను వీడియో తీశాడో కిరాతక భర్త. అనంతరం ఆ వీడియోను ఆమె కుటుంబ సభ్యులకు పంపాడు. రాజస్థాన్లో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
నిప్పు అంటించుకున్న భార్యను వీడియో తీసిన భర్త
ఆ తర్వాత దాన్ని ఆమె తల్లిదండ్రులకు పంపాడు. పూర్తిగా కాలిన గాయాలతో ఉన్న ఆమె జైపుర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 22న మరణించింది. దీనికి సంబంధించి ఆమె భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.