తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గర్భం దాల్చిందని పెళ్లి.. అది వద్దన్నందుకు భార్యపై హత్యాయత్నం! - భార్య గదికి నిప్పెటిన భర్త

Husband Tries to Kill Wife: అబార్షన్​ చేయించుకోవడానికి తిరస్కరించిందని భార్యపై హత్యాయత్నం చేశాడు ఓ కిరాతక భర్త. ఆమె ఉన్న గదికే నిప్పంటించి చంపేందుకు ప్రయత్నించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.

Husband tries to kill wife
Husband tries to kill wife

By

Published : Mar 14, 2022, 12:50 PM IST

Husband Tries to Kill Wife: దిల్లీలోని ఆదర్శనగర్​లో క్రూరమైన ఘటన వెలుగుచూసింది. గర్భం తొలగించుకోవడానికి తిరస్కరించిందని భార్యనే చంపాలని చూశాడు ఓ కిరాతక భర్త. ఆమె ఉన్న గదికి నిప్పంటించి.. హత్యాయత్నం చేశాడు.

అసలేమైందంటే..?

ఐదేళ్ల క్రితం.. ఆ భార్యాభర్తలు స్నేహితులయ్యారు. ఆ సమయంలో ఆమె గర్భం దాల్చింది. దీంతో సమాజంలో అవమానాలు ఎదురవకుండా ఉండేందుకు కొన్నినెలల క్రితమే వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ అబార్షన్​ చేసుకోవాలని ఆమెను తీవ్రంగా ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు భర్త. అందుకు ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. ఆదివారం రాత్రి కూడా ఎలాగైనా అబార్షన్ చేయించుకోవాలని ఆమెను ఒత్తిడి చేశాడు. ఎప్పటిలాగే భార్య అందుకు అంగీకరించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన భర్త.. తన భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

గదిలో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో నిప్పంటించాడు. అయితే అక్కడ నుంచి ఎలాగో తప్పించుకున్న బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ జరిగింది:కల్తీ మద్యం కాటుకు ఐదు రోజుల్లో 11 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details