తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గర్భంతో ఉన్న భార్యపై దారుణం.. చేతులను బైక్​కు​ కట్టేసి, రోడ్డుపై ఈడ్చుకుంటూ..

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోరం జరిగింది. గర్భంతో ఉన్న భార్యను బైక్​కు​ కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు ఓ భర్త. తీవ్రంగా గాయపడ్డ మహిళ ప్రస్తుతం విషమస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు, ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి ప్రాణాలు తీశాడు మరో వ్యక్తి. రాజస్థాన్​లో ఈ ఘటన జరిగింది. పండగ వేళ గుజరాత్​లో డ్యామ్​లో పడి ముగ్గురు మృతి చెందారు.

husband-tied-pregnant-wife-to-bike-and-dragged-her-in-uttarpradesh
గర్భణీ భార్యపై బైక్​కు​ కట్టేసి ఈడ్చుకళ్లిన భర్త

By

Published : Jan 15, 2023, 10:37 AM IST

గర్భంతో ఉన్న భార్యతో కర్కశంగా ప్రవర్తించాడు ఓ భర్త. మద్యం మత్తులో ఆమెపై దారుణంగా దాడి చేశాడు. అనంతరం ఆమె చేతులను బైక్​కు​ కట్టేసి, రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. తీవ్రంగా గాయపడ్డ మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఘుచైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే రామ్​గోపాల్​.. అతని భార్య సుమనపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఘటనపై బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన చెల్లిని చంపేందుకు రామ్​గోపాల్​ ప్రయత్నించాడని పోలీసులకు తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

తీవ్రంగా కొట్టి వ్యక్తి ప్రాణాలు తీసిన మరో వ్యక్తి..
చిన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. పాతకక్షలతో గొడవ పడ్డ ఇద్దరు వ్యక్తులు.. అనంతరం దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఈశ్వర్ సింగ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజస్థాన్​లోని భరత్​పుర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఈ దారుణం జరగగా.. ఈశ్వర్ సింగ్ శనివారం మృతి చెందాడు. నిందితుడిని గోవింద్ గుర్జార్​గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు సేవర్​లోని ఘసోలా గ్రామంలో నివాసం ఉంటున్నారు. గ్రామంలోని ఓ షాపు వద్దకు సరుకుల కోసం వచ్చిన ఈశ్వర్ సింగ్​పై.. నిందితుడు గోవింద్ దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఈశ్వర్​.. అనంతరం మృతి చెందాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

డ్యామ్​లో పడి ముగ్గురు మృతి..
పండగ వేళ గుజరాత్​లోని జునాగఢ్​లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు ముగ్గురు యువకులు, ఓ యువతి భఖర్వాడ్ డ్యామ్​లో పడిపోయారు. ఘటనలో ఓ యువకుడు గల్లంతు కాగా, మిగిలిన ముగ్గురు అక్కడే చనిపోయారు. మలియా హతీనా తాలూకాలో ఈ ఘటన జరిగింది. గల్లంతైన యువకుడి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.

పది రూపాయల కోసం కాల్పులు..
పది రూపాయల కోసం తుపాకీతో కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఝార్ఖండ్​లోని పలమూ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని సోనూ సోనిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు.. మరో ముగ్గురితో కలిసి వినయ్​ గుప్తాకు చెందిన మద్యం దుకాణానికి వచ్చాడు.

అనంతరం వారంతా మద్యం కొన్నారు. వినయ్.. బాటిల్​పై అదనంగా పది రూపాయలను డిమాండ్​ చేశాడు. దీంతో వినయ్​పై గొడవకు దిగాడు సోనూ సోని. కాసేపటికి గొడవ తీవ్రం అయింది. దీంతో వినయ్​కు మద్దతుగా తన సోదరులు వచ్చారు. అనంతరం సోనూ సోని వారిపై ఏడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. సోనూ సోని ఇప్పటికే పలు కేసుల్లో నిందితునిగా ఉన్నట్లు వారు వెల్లడించారు.

హారన్‌ కొట్టారని దాడి చేసి..
దిల్లీలో రోడ్డుపై ఓవర్‌టేక్‌ విషయంలో రెండు కార్లలోని వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఓ కారులోని వ్యక్తిని మరో కారులోని నిందితులు బానెట్‌పై అరకిలోమీటర్‌ వరకు తీసుకెళ్లడం గమనార్హం.

ఇటీవల దేశ రాజధాని దిల్లీలో ఓ యువతిని కారు ఈడ్చుకెళ్లిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. అయితే, ఈ కేసులో కారు డ్రైవర్‌ ఉద్దేశపూర్వకంగానే ఓ వ్యక్తిపైకి వాహనాన్ని ఎక్కించి, అతను బానెట్‌పై ఉండగానే.. రద్దీ రహదారుల్లో అర కిలోమీటర్‌ వరకు ఈడ్చుకెళ్లాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హర్విందర్‌ కోహ్లీ, అతని స్నేహితుడు జయప్రకాశ్‌ శనివారం ఓ కారులో పశ్చిమ దిల్లీలోని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ముందు ఉన్న ఓ కారును ఓవర్‌టేక్‌ చేసేందుకుగానూ జయప్రకాశ్‌ హారన్‌ కొట్టారు. దీంతో తమ ముందున్న కారులోని వ్యక్తులు వారిని అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం మొదటై కొట్లాటకు దారితీసింది. సముదాయించేందుకు యత్నించిన హర్విందర్‌పై కూడా దాడికి దిగారు. ఈ క్రమంలోనే తండ్రి సూచనతో నిందితుడు.. కారుతో హర్విందర్‌ను ఢీకొట్టేందుకు యత్నించాడు. అయితే, అతను బానెట్‌పై దూకి కారు విండ్‌షీల్డ్ వైపర్‌లను పట్టుకున్నాడు. మరోవైపు నిందితుడు కారు ఆపకుండా.. అలాగే దాదాపు 500 మీటర్లు వరకు తీసుకెళ్లాడు. చివరకు, ఇతర వాహనదారులు అడ్డుకోవడంతో కారును నిలిపేసి, అక్కడి నుంచి పారిపోయారు. అయితే, కేసు నమోదు చేసేందుకు వెళ్తే పోలీసులు సరిగా స్పందించలేదని హర్విందర్‌ ఆరోపించారు. అలాంటిదేమీ లేదని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నామని పేర్కొన్నారు.

ముక్కలు చేసిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు..
ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టు అయిన ఇద్దరు నిందితులు.. పోలీసులు అవాక్కయ్యే సమాచారం ఇచ్చారు. ముక్కలుగా నరికిన మృతదేహాన్ని తాము చూశామని చెప్పడంతో పోలీసులు శనివారం ఆ మృతదేహాన్ని గుర్తించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో జగ్జీత్‌ సింగ్‌ (జగ్గా), నౌషద్‌ అనే ఇద్దరిని దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు భల్స్‌వా ప్రాంతంలో అరెస్టు చేశారు.

వారిని విచారిస్తున్న సమయంలో తాము భల్స్‌వా ప్రాంతంలో ఉన్న ఓ ఫ్లాట్‌లో మూడుకు పైగా ముక్కలుగా కోసిన ఒక మృతదేహాన్ని చూశామని తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఖండిత మృతదేహాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుల దగ్గర రెండు గ్రనేడ్లు, మూడు పిస్తోళ్లు, 22 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో జగ్గాకి ఖలిస్థానీ ఉగ్రవాదులతో, నౌషద్‌కు ఉగ్రవాద సంస్థ 'హర్కత్‌ ఉల్‌ అన్సర్‌'తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details