తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్త,పిల్లల్ని వదిలి పారిపోయిన భార్య.. 5 ఏళ్లలో 35 సార్లు..! చివరకు పోస్టర్​తో భిక్షాటన.. - ఉత్తర్​ప్రదేశ్​ మైనర్​ మిస్సింగ్​ కేసు

ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఓ మహిళ తన భర్తను వదిలి వెళ్లిపోయింది. అందులో ఏముంది అనుకుంటే పొరపాటే..! గత 5 సంవత్సరాల్లో ఆమె ఇలా దాదాపుగా 35 సార్లు భర్త, పిల్లలను విడిచిపెట్టి పారిపోయింది. అధికారులు ఎన్ని సార్లు వెతికిపెట్టి తెచ్చినా ఆమెది ఇదే తంతు. ప్రస్తుతం ఆమె మళ్లీ తన భర్త, 4 నెలల చిన్నారిని వదిలిపెట్టి వెళ్లింది. దీంతో చేసేదేమి లేక భర్త ఆమె పోస్టర్​తో రోడ్లపై భిక్షాటన చేస్తున్నాడు. ఈ ఘటన బిహార్​లో వెలుగుచూసింది.

wife run away 30 35 times in Kaimur
35 సార్లు భర్తను వదిలి లేచిపోయిన భార్య

By

Published : Jan 6, 2023, 10:44 PM IST

Updated : Jan 6, 2023, 11:00 PM IST

బిహార్​లో ఓ వ్యక్తిని అతడి భార్య ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు ఏకంగా 35 సార్లు వదిలిపెట్టి పారిపోయింది. దీంతో ఇద్దరు చిన్నారులను ఇంట్లో వదలి ఉండలేక.. ఉద్యోగం మానేసి రోడ్లపై భిక్షాటన చేస్తున్నాడు. తన భార్య ఫొటో చేతిలో పట్టుకొని.. ఆమె తిరిగి వచ్చేలా చూడాలని పోలీసులను కోరుతున్నాడు. తన భార్య తిరిగి రాకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆ వ్యక్తి.

ఇదీ జరిగింది
కైమూర్​కు చెందిన కృష్ణ మురారి గుప్తా.. అదే గ్రామానికి చెందిన ఓ మహిళను 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం రామ్​గఢ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో నివాసం ఉంటున్నాడు. అయితే పెళ్లైన ఏడాది నుంచే.. అతడి భార్య ఇంటి నుంచి వెళ్లడం ప్రారంభించింది. అధికారుల జోక్యంతో చాలా సార్లు తిరిగివచ్చింది. కానీ మళ్లీ అదే పని చేసేది. ఇలా ఇప్పటికి 35 సార్లు పారిపోయింది. వారికి 4 సంవత్సరాల కుమారుడు, 4నెలల చిన్నారి ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరినీ వెంటబెట్టుకొని.. చేతిలో 'నా భార్య తప్పిపోయింది' అనే పోస్టర్​తో రామ్​గఢ్​ మార్కెట్​లో​ తిరుగుతున్నాడు కృష్ణ మురారి. తన భార్య దొరకకుంటే తనకు ఆత్మహత్యే దిక్కని కృష్ణ మురారి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

"7 నెలల్లో నా భార్య చాలాసార్లు పారిపోయింది. పిల్లలిద్దరూ నా దగ్గరే ఉన్నారు. ఈ పిల్లలను చూసుకోవడానికి మా ఇంట్లో ఎవరూ లేరు. నాకు భిక్షాటన చేయడం ఇష్టం లేదు కానీ పిల్లల కోసం ఇలా చేయాలి. నేనేం చేయాలి? నాకు ఎవరు పని ఇస్తారు? మంచి ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది. పిల్లలిద్దరూ పుట్టినప్పటి నుంచి నేనే ఒంటరిగా పెంచుతున్నాను. పిల్లలు పుట్టినప్పటి నుంచి నా భార్య పరారీలో ఉంది. ఐదేళ్లలో దాదాపు 35 సార్లు ఇంటి నుంచి పారిపోయింది".
--కృష్ణ మురారి గుప్తా, బాధితుడు

బలవంతంగా మతమార్పిడి.. 11ఏళ్ల పాటు బందీ
ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలో ఓ ముస్లిం యువకుడు మాయమాటలు చెప్పి ఓ యువతిని బలవంతంగా మతం మార్పిడి చేయించాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకొని అనేక సార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటన 11 ఏళ్ల క్రితం జరగగా.. అప్పటి నుంచి ఆమెను బందీగా ఉంచాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బదౌన్​కు చెందిన ఓ బాలికకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తర్వాత అతడి మామయ్య వద్ద ఉంటూ పెరిగింది. 15 ఏళ్ల వయస్సులో ఉన్నప్పడు డ్యాన్సులు చేయడం ప్రారంభించింది. అదే సమయంలో తనతో పాటు డీజేగా పనిచేసే ఓ ముస్లిం యువకుడు.. బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా మతమార్పిడి చేశాడు. అనంతరం బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అనేక సార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. 11 సంవత్సరాల పాటు ఆమెను బందీగా ఉంచి అనేక ఇబ్బందులకు గురిచేశాడు. ప్రస్తుతం అతడి చెర నుంచి తప్పించుకొన్న యువతి.. ఆమె మామయ్య వద్దకు చేరుకుంది. ఆ తర్వాత అతడి సాయంతో నిందితుడు సాదిక్​ సహా మరో ఆరుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మైనర్​ను ఎత్తుకెళ్లినందుకు.. 15 ఏళ్ల తర్వాత అరెస్ట్​
ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మైనర్​ను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకొన్న వ్యక్తిని 15 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు పోలీసులు. ఫిరోజ్‌పూర్ గ్రామానికి చెందిన సందీన్​ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల పింకీ అనే బాలికను ప్రేమించాడు. ఆ తర్వాత వారిద్దరూ ఇంటినుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం గ్రామానికి రాకుండా ఉత్తరాఖండ్​కు చేరుకున్నారు. అక్కడ వారు వేరే పేరుతో నివసించారు. సందీప్​.. ముఖేశ్​గా, పింకీ.. సంగీతగా పేర్లు మార్చుకొని సహరన్​పుర్​కు 8 ఏళ్ల తర్వాత చేరుకున్నారు. అక్కడ వారు తమ ఇద్దరి కుమారైలతో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే 15 ఏళ్ల వయసున్న తన కుమార్తెను సందీప్ మాయమాటలు చెప్పి అపహరించాడని పింకీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో దానిపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు సందీప్​ కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయింది. సందీప్​ ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ప్రకటించినా సరే దొరకలేదు. ఇన్నాళ్లకు వారి ఆచూకీ తెలియగా పోలీసులు సందీప్​​ను పోక్సో చట్టం కింద అరెస్ట్​ చేశారు.

Last Updated : Jan 6, 2023, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details