Husband Recorded Wife's Suicide Video in Hyderabad :ఆ వ్యక్తిరోజూ మద్యం తాగొచ్చి భార్యను చిత్రహింసకు గురి చేసేవాడు. అతడి వేధింపులు ఆమె తట్టుకోలేకపోయింది. దీనికి కారణం అతడు మద్యానికి బానిసవ్వడమేనని అందుకే మద్యం మానేయమని ఎన్నోసార్లు భర్తను వేడుకుంది. అయినా సరే అతడు మానలేదు. పైగా ఇంకాస్త ఎక్కువగా తాగి వచ్చి మరింత వేధించడం మొదలుపెట్టాడు. ఆ నరకం తట్టుకోలేకపోయిన ఆమె చనిపోవాలని నిశ్చయించుకుంది. భర్త కళ్లెదుటే ఉండగా, 'నువ్వు మందు తాగడం మానకపోతే నేను చనిపోతానంటూ' బెదిరిస్తూ ఉరి వేసుకోబోయింది.
అది చూసిన భర్త ఆమెను ఆపాల్సింది పోయి 'నేను చావు ఎప్పుడూ చూడలేదు. నువ్వు చచ్చిపో ఇప్పుడు చూస్తానంటూ' వెకిలి నవ్వు నవ్వాడు. అది చూసి తనకు చావే నయమని భావించిన ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదంతా కళ్లారా చూస్తూ పైశాచికంగా మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు ఆ ఉన్మాది. ఆ తర్వాత తన బావమరిదికి ఫోన్ చేసి నీ చెల్లి చచ్చిపోయింది వచ్చి శవం తీసుకుపో అని చెప్పాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. భార్య మరణించి, కన్నబిడ్డలు ఏడుస్తున్నా చలించని నిందితుడిని చూసి పోలీసులే విస్మయం చెందారు. నిందితుడిని ఆదుపులోకి తీసుకున్నారు.
Husband Suicide Selfi Video Viral : భార్య విడిచి వెళ్లిపోయిందని.. భర్త ఆత్మహత్య.. వీడియో వైరల్
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి సయ్యద్ అలీగూడ (రవీంద్రనగర్)కు చెందిన షేక్ రసూల్ (39)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు నలుగురు సంతానం ఉన్నారు. అలాగే నాలుగేళ్ల క్రితం అర్షాబేగం(22)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. రసూల్ కార్పెంటర్‌గా పనిచేస్తూ రెండు కుటుంబాలనూ పోషిస్తున్నాడు. కొన్నాళ్ల పాటు బాగానే సాగింది వారి జీవింతం. అయితే రసూల్ కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ రెండో భార్యను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు.