Husband murdered by wife: తన భర్తను దుండగులు బైక్పై వచ్చి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. అయితే ఆమె, తన ప్రియుడు మరో వ్యక్తికి సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకు విహహేతర సంబంధమే కారణమని నిర్ధరణ అయింది. ఈ ఘటన పంజాబ్లోని అమృత్సర్ సమీపంలోని కాలే గ్రామంలో ఆదివారం జరిగింది.
అసలేం జరిగిందంటే: హరీందర్ సింగ్ దుబాయ్లో ఉండేవాడు. అతని భార్య సత్నామ్ కౌర్.. పంజాబ్లో ఉండేది. అర్ష్దీప్ అనే వ్యక్తితో.. సత్నామ్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఆ విషయం హరీందర్కు తెలియడం వల్ల భార్యను మందలించాడు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని హరీందర్ను హత్య చేయాలని అర్ష్దీప్, సత్నామ్ నిర్ణయించుకున్నారు. హరీందర్ను హత్య చేసేందుకు వరీందర్తో రూ.2,70,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు.