husband makes nude videos: మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. భర్త తన న్యూడ్ వీడియోలు చిత్రీకరించి, చేతబడి కోసం తన లోహదుస్తులు ఉపయోగించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఏడుగురు సోదరులకు ఏకైక సోదరిని అని, బర్వాలీ చౌకీకి చెందిన జునా అనే మత గురువుతో 2010లో వివాహం జరిగిందని బాధితురాలు తెలిపింది.పెళ్లయిన కొద్ది రోజులకే తనను కట్నం కోసం వేధించడం ప్రారంభించాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి కుటుంబం పేదవారు కావడం వల్ల నిందితుడి డిమాండ్‌ను నెరవేర్చలేకపోయామని.. దీంతో కొట్టి హింసించేవాడని ఫిర్యాదు పేర్కొంది.
"మత్తు మందు కలిపిన మిఠాయిలు తిని నేను అపస్మారక స్థితిలో నిద్రిస్తున్న సమయంలో జునా న్యూడ్ వీడియోలు తీసేవాడు. అతను చేతబడి చేయడానికి నా లోదుస్తులను తీసుకున్నాడు. మరొక మహిళను వివాహం చేసుకున్నాడు. బాత్‌రూమ్‌లో నేను స్నానం చేస్తూ బట్టలు మార్చుకుంటున్న దృశ్యాన్ని వీడియో రికార్డ్ చేశాడు. ఈ పనికి నేను అభ్యంతరం చెప్పడం వల్ల నన్ను తీవ్రంగా కొట్టాడు. మదర్సాకు వచ్చే అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించేవాడు"
-- బాధితురాలు