Husband loses wife in gambling: ఉత్తర్‌ప్రదేశ్ బలియా జిల్లాలో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. జూదంలో భార్యను తాకట్టుపెట్టి ఆమెను కోల్పోయాడో వ్యక్తి. ఆ తర్వాత భార్య తనకు రూ.రెండు లక్షలు ఇవ్వలేదని ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. దీంతో న్యాయం కోసం జిల్లా కలెక్టర్‌ను సంప్రదించింది ఆ మహిళ.
జూదంలో భార్యను ఓడి.. ట్రిపుల్ తలాక్‌తో ఇంటి నుంచి గెంటేసి.. - జూదంలో భార్యను కోల్పోయిన వ్యక్తి
Husband loses wife in gambling: జూదంలో భార్యను తాకట్టుపెట్టి ఆమెను కోల్పోయాడో వ్యక్తి. ఆ తర్వాత రెండు లక్షలు ఇవ్వనందుకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఆమెను ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. ఈ విస్తుపోయే ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో బలియా జిల్లాలో జరిగింది.
జూదంలో భార్యను కోల్పోయిన వ్యక్తి
దిల్లీకి తీసుకెళ్లి అక్కడ జూదంలో తనను తాకట్టు పెట్టి తన భర్త ఓడిపోయాడని కలెక్టర్‌కు మహిళ తెలిపింది. అక్కడి నుంచి తప్పించుకుని తన స్వస్థలమైన బలియా జిల్లాకు చేరుకున్నట్లు ఆమె వెల్లడించింది. ఆ తర్వాత రూ.రెండు లక్షలు ఇవ్వాలని తనను భర్త వేధించాడని ఆరోపించింది. ఇవ్వనందుకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి బయటికి గెంటేశాడని తన గోడు వెల్లబోసుకుంది.
ఇదీ చదవండి:వేల లీటర్ల నీటిని మింగేస్తున్న 'మాయా బావి'