తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మెటల్ ల్యాంప్​తో భార్యను హతమార్చిన భర్త.. అదే కారణమా? - భార్యపై అనుమానంతో హత్య

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ల్యాంప్​తో ఆమె తలపై దాడి చేశాడు. బాధితురాలు మృతి చెందింది. కేరళలో ఈ దారుణం జరిగింది.

husband kills wife
భార్యను హత్యమార్చిన భర్త

By

Published : Sep 6, 2022, 3:36 PM IST

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. మెటల్​ ల్యాంప్​తో భార్య తలను పగులగొట్టాడు. ఈ ఘటన కేరళ.. తిరువనంతపురంలోని వర్కాలా గ్రామంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం వేకువజామున 2.30 గంటల సమయంలో హెవీ మెటల్ ల్యాంప్​తో తన భార్య తలపై అనీశ్ (35) కొట్టాడు. ఆమెను పొరుగింటి వారు.. సమీపంలోని ఆస్ప్రతికి తరలించినా అప్పటికే మరణించింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల క్రితమే అనీశ్​కు బాధితురాలితో వివాహమైంది. అనంతరం దంపతులు గల్ఫ్​కు వెళ్లిపోయారు. అనీశ్​ అనారోగ్యం కారణంగా.. కొద్ది రోజుల క్రితమే నూతన దంపతులు కేరళకు వచ్చారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

.

ABOUT THE AUTHOR

...view details