తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిడ్డకు జన్మనిచ్చిన నాలుగో రోజే.. భార్యను గొంతునులిమి చంపిన భర్త.. - క్రైం

Wife murder: బాలింత అని కూడా చూడకుండా భార్యను అత్యంత దారుణంగా చంపాడు ఓ భర్త. పండంటి మగబిడ్డను జన్మనిచ్చిన నాలుగో రోజే ఆమెను ఆస్పత్రిలోనే గొంతునులుమి హతమార్చాడు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Husband Killed Wife
భార్యను ఆస్పత్రిలోనే గొంతునులిమి చంపిన భర్త

By

Published : Jun 4, 2022, 4:33 PM IST

Updated : Jun 5, 2022, 10:54 AM IST

భార్యను ఆస్పత్రిలోనే గొంతునులిమి చంపిన భర్త.

Husband Killed Wife: పంజాబ్ కపూరథలా జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. భార్యను ఓ భర్త ప్రభుత్వ ఆస్పత్రిలోనే గొంతునులిమి హత్య చేశాడు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన మూడో రోజే.. బాలింత అని కూడా చూడకుండా ఈ దారుణానికి ఒడిగట్టాడు. గైనకాలాజీ వార్డులో ఉన్న ఆమెను మొదట గొంతునులిమాడు. చనిపోయిందో? లేదో? అనే అనుమానంతో మరోసారి మొహంపై దిండుపెట్టి బిగబట్టి ఊపిరాడకుండా చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆస్పత్రి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఘటన జరిగిన సమయంలో గదిలో నవజాత శిశువుతో పాటు ఓ బాలుడు కూడా ఉన్నాడు.
బల్జిందర్ కౌర్ అనే నిండు గర్భిణి జూన్​ 1న కపూర్​థలా జిల్లా ఆస్పత్రిలో చేరింది. అదే రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు, భర్త మంజిత్​ సింగ్​కు మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 4న ఆమెను ఆస్పత్రిలోనే గొంతునులిమి హత్య చేశాడు.

నడిరోడ్డుపై దారుణ హత్య: పంజాబ్ మోగా జిల్లాలోనూ అత్యంత కిరతాక ఘటన జరిగింది. బధ్నీ కాలన్​ ప్రాంతంలో 22 ఏళ్ల యువకుడ్ని ఐదుగురు కలిసి దారుణంగా హత్య చేశారు. నడిరోడ్డుపైనే కత్తులతో వెంబడించి దాడి చేసి చంపారు. మెడపై తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో పడి ఉన్న అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

పిల్లలతో పాటు నదిలోకి దూకిన తండ్రి: మధ్యప్రదేశ్ సీహోర్ జిల్లాలో రాజేశ్​ అహిర్వార్​ అనే 32 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి నర్మదా నదిలో దూకాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో చిన్నారులు సార్థిక్​(2), ఓంవతి(4) ప్రాణాలు కోల్పోయారు. తండ్రి రాజేశ్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురు నదిలో దూకగానే స్థానికులు కొందరు చూసి వారిని రక్షించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అయితే ఇద్దరు చిన్నారులు మాత్రం బతకలేదని పేర్కొన్నారు. రాజేశ్​ తన భార్యతో గొడవపడి కోపంతో పిల్లలను తనతోపాటు తీసుకెళ్లి నదిలో దూకినట్లు వివరించారు. ఘటనకు రెండు రోజుల ముందు రాజేశ్ భార్యను కొట్టగా.. ఆమె ఆస్పత్రిలో చేరిందని, ఆ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం మరోసారి గొడవపడ్డారని వెల్లడించారు.

హరియాణా గురుగ్రామ్​లోని రఠీవాస్​ గ్రామంలో కొద్ది రోజులుగా తనతో సహజీవనం జీస్తున్న 22 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఆమెపై అనుమానంతో ఈ క్రూర చర్యకు పాల్పడ్డాడు. కిచెన్​లో ఉపయోగించే కత్తితో ఆమెను హతమార్చాడు. అనంతరం పోలీసులకు అతడే సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు వచ్చి నిందితుడు రాహుల్​ అలియాస్ సోను(25)ను అదుపులోకి తీసుకున్నారు.

దిల్లీ ఆదర్శ్ నగర్​లో ఇద్దరు అన్నాదమ్ములు కలిసి 28ఏళ్ల యువకుడ్ని నడిరోడ్డుపై హత్య చేశారు. అతనిపై బ్లేడు, రాయితో దాడి చేసి హతమార్చారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. చనిపోయిన యువకుడు డ్రగ్స్​కు డబ్బులు కావాలని రాహుల్ కాళి అనే వ్యక్తితో గొడవపడ్డాడని పోలీసులు తెలిపారు. అయితే రాహుల్ తన సోదరుడు రోహిత్ కాళికి ఫోన్​ చేయగా.. అతను వచ్చాక ఇద్దరు కలిసి మృతుడు నరేందర్​పై దాడి చేశారు. పదే పదే బ్లేడు, రాయితో గాయపరిచారు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:మంత్రులంతా రాజీనామా చేయాలని సీఎం ఆదేశం!

Last Updated : Jun 5, 2022, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details