తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో 'శ్రద్ధా వాకర్' తరహా దారుణం.. రెండో భార్యను చంపి ముక్కలుగా చేసి.. - ఝార్ఖండ్ క్రైమ్ న్యూస్

యావత్​ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్​ హత్య తరహా దారుణం ఝార్ఖండ్​లో జరిగింది. ఓ వ్యక్తి తన రెండో భార్యను పాశవికంగా హత్యచేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్నిఅనేక ముక్కలుగా నరికి బయటపడేశాడు. మరోవైపు, అమెరికా వెళ్లబోతున్నానన్న ఆనందంలో ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు. ఈ విషాద ఘటన పంజాబ్​లో వెలుగుచూసింది.

husband kills wife
భార్యను హతమార్చిన భర్త

By

Published : Dec 18, 2022, 2:09 PM IST

Updated : Dec 18, 2022, 3:37 PM IST

దేశ రాజధాని దిల్లీలో ప్రియుడి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్‌ ఘటన మరవకముందే ఝార్ఖండ్​ సాహిబ్​హంజ్​లో అలాంటి ఘోరమే జరిగింది. ఓ వ్యక్తి తన రెండో భార్యను పాశవికంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని అనేక ముక్కలుగా నరికేసి.. బయట పడేశాడు. మృతురాలిని రూబికా పహారియాగా(22) పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మృతురాలు రూబికా గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. డాగ్​ స్వ్కాడ్​తో గాలింపు చర్యలు చేపట్టగా.. రూబికా శరీరంలోని 18 భాగాలు పోలీసులకు లభించాయి. మిగతా శరీరభాగాల కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దిల్దార్​ అన్సారీ, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడికి అంతకుముందే వివాహం జరిగింది. రూబికాను రహస్యంగా రెండో వివాహం చేసుకుని వేరే ఇంట్లో కాపురం పెట్టాడు.

అమెరికా వెళ్తున్నానన్న ఆనందంలో..
పంజాబ్​ సంగ్రూర్​లో ఘోరం జరిగింది. పాటియన్వాలి గ్రామానికి చెందిన రంజోద్ సింగ్(20) అనే యువకుడు.. అమెరికా వెళ్లబోతున్నానన్న ఆనందంలో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. అయితే ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మరణించాడు.

Last Updated : Dec 18, 2022, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details