Husband Kills Wife and Child: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో రామ నవమి రోజున ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, కూమారున్ని చంపి, బంధువులతో వాట్సప్‌లో ఫొటోలు పంచుకున్నాడు. మృతదేహాల ముందే మృతురాలి సోదరునితో వీడియో కాల్లో మాట్లాడాడు. శ్రీరామ్‌పుర్ మండలంలో బలరాం కుడాలె తన భార్య అక్షాడా నివసిస్తున్నారు. వీరు 2015లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. బలరాం ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే.. సొంతంగా ఓ ట్రక్కు కొనడానికి పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాల్సిందిగా భార్యను కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీ రామ నవమి రోజున ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
భార్య, కొడుకుని చంపి.. బంధువులకు వాట్సప్‌లో ఫొటోలు షేర్ చేసి.. - Husband Kills Wife and Child in ahmadnagar
Husband Kills Wife and Child: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, కూమారున్ని చంపి, బంధువులతో వాట్సప్‌లో ఫొటోలు పంచుకున్నాడు. మృతదేహాల ముందే వీడియో కాల్లో మాట్లాడాడు.
భార్య,కొడుకుని చంపిన భర్త
కోపంలో బలరాం.. భార్యను పారతో తలపై బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత నిందితుడు తన కుమారున్ని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాలను చూపిస్తూ.. మృతురాలి సోదరునికి వీడియో కాల్ చేసి విషయం చెప్పాడు. బంధువుల వాట్సప్‌లకు ఫొటోలు షేర్ చేశాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితున్ని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:మళ్లీ డ్రగ్స్ కలకలం.. రూ.60కోట్ల సరకు స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్
Last Updated : Apr 11, 2022, 9:46 PM IST
TAGGED:
భార్య,కొడుకుని చంపిన భర్త