బిహార్లో సారన్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కూరలో ఉప్పు తక్కువగా ఉందని కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త.
పోలీసుల వివరాల ప్రకారం.. కలాన్ గ్రామానికి చెందిన ప్రభురాం.. భార్య వంట చేసింది. అయితే పొరపాటున ఆమె కూరలో కాస్త ఉప్పు తక్కువ వేసింది. భోజన సమయంలో కూరలో ఉప్పు తక్కువగా ఉందని భార్యపై కోపడ్డాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగింది.
కూరలో ఉప్పు తక్కువైందని భార్య దారుణ హత్య - భార్యను చంపిన భర్త
కూరలో ఉప్పు తక్కువైందని భార్యను కత్తితో పొడిచి చంపాడు ఓ భర్త. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన బిహార్లో జరిగింది.
husband-killed-wife-due to less salt in curry in bihar
దీంతో మరింత కోపం పెంచుకున్న భర్త.. ఆమెను కత్తితో దారుణ హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం బాధితురాలి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరుకు పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. .