తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శ్రద్ధా వాకర్​' తరహా హత్య.. భార్యను ముక్కలుగా నరికి.. గోనె సంచిలో వేసి విసిరేసిన భర్త - ఒడిశా భార్య మర్డర్​

ఓ వ్యక్తి.. తన భార్యను ముక్కలుగా నరికి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి నిర్మానుష్య ప్రదేశంలో విసిరేశాడు. ఒడిశాలో ఈ ఘటన జరిగింది. మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు దుండగులు.

husband killed wife and chopped into pieces in odisha
husband killed wife and chopped into pieces in odisha

By

Published : May 8, 2023, 12:33 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్​ హత్య లాంటి మరో ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. ఓ వ్యక్తి.. తన భార్యను ముక్కలుగా నరికి చంపేశాడు. అనంతరం ఓ గోనె సంచిలో మృతదేహాన్ని తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పారవేశాడు. మృతురాలిని మామా దాస్​గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలేశ్వర్​జిల్లాలోని బస్తా పోలీస్​ స్టేషన్ పరిధిలోని పలాసియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సాధబ్​ దాస్​ అనే వ్యక్తి తన భార్య, తల్లీదండ్రులతో కలిసి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పదేళ్ల క్రితం సాధబ్ దాస్ రైసువాన్ గ్రామానికి చెందిన మామాను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగాక అనేకసార్లు వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి.

ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం.. సాధబ్​ తన భార్యను నరికి ముక్కలు చేసి గోనె సంచిలో వేసి ఎవరూ లేని ప్రదేశంలో విసిరేశాడు. గోనె సంచిని తీసుకెళ్తున్న సాధబ్​ను చూసిన గ్రామస్థులు.. అనుమానమొచ్చి మామాదాస్​ కుటుంబసభ్యులకు తెలిపారు. వెంటనే వారు వెతకగా.. ఓ గోనె సంచిలో మామా దాస్​ మృతదేహం లభ్యమైంది. ఘటనపై గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఏడేళ్ల బాలికపై రేప్​.. దారుణ హత్య!
ఉత్తర్​ప్రదేశ్​లోని కన్నౌజ్​ జిల్లాకు చెందిన ఓ బాలిక.. దారుణ హత్యకు గురైంది. మూడు రోజులుగా కనిపించని ఆ బాలిక.. గ్రామ శివార్లలోని పొలాల్లో విగతజీవిగా కనిపించింది. ఛిద్రమైన స్థితిలో వివస్త్రగా చిన్నారి మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసిన తర్వాత బాలికను హత్య చేసి ఉంటారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.

తాల్గ్రామ్ పోలీస్​స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తున్న ఒక వ్యక్తి.. మే 4న తన పెద్ద సోదరుడి కుమార్తె వివాహ ఊరేగింపునకు వెళ్లాడు. పెళ్లి కార్యక్రమాల వల్ల అందరూ బిజీ అయిపోయారు. పెళ్లి ఊరేగింపు సమయంలో.. అతడి కుమార్తె అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఆమె అదే గ్రామంలోని పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఆమె కోసం ఎంత వెతికినా దొరకలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆదివారం సాయంత్రం ఊరి బయట పొలంలో బాలిక మృతదేహం లభ్యమైంది. ఆ సమయంలో మృతదేహానికి కళ్లు లేవు. కాళ్లు విరిగి ఉన్నాయి. ఆమెపై అత్యాచారం చేసిన అనంతరం మృతదేహాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసి ఇక్కడ పడేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చిన్నారి కనిపించకుండా పోయినప్పటీ నుంచి ఓ గుర్తుతెలియని యువకుడు వాట్సాప్‌లో కాల్ చేస్తున్నాడని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు కారకుడు అతడేనని అనుమానిస్తున్నారు. ఈ కాల్‌కు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు కూడా అందించారు.

కుక్కపై అమానుష చర్య..
ఛత్తీస్​గఢ్​లోని దుర్గ్​ జిల్లాలో ఓ వ్యక్తి.. శునకం పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. కుక్కను వైర్లతో కట్టేసి ఈడ్చుకుంటూ వెళ్లాడు. దీంతో ఆ శునకం మరణించింది. ఘటనపై జంతు ప్రేమికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద చర్యలు చేపట్టి అతడిని అరెస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details