తీసుకున్న లోన్ తిరిగి చెల్లించే అవసరం ఉండదన్న ఉద్దేశంతో భార్యనే కిరాతకంగా హత్య చేశాడో భర్త. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన బిహార్లోని సహస్ర జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పత్బిందా గ్రామానికి చెందిన ములాయం యాదవ్, లక్ష్మీదేవి ప్రేమించుకుని 8 ఏళ్ల క్రితం ఇంటర్ కులాంతర వివాహం చేసుకున్నారు. పెద్ద వారికి ఇష్టం లేకపోయినా.. 8 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. అయితే డబ్బుల కోసం ములాయం తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో లక్ష్మీదేవి తన తల్లిని డబ్బులు సమకూర్చమని అడిగింది. అనంతరం లక్ష్మీదేవీ పేరుమీద తన తల్లి బ్యాంకులో లోన్ ఇప్పించింది.
అయితే ఆ లోన్ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తన భార్య చనిపోతే లోన్ తిరిగి చెల్లించే అవసరం ఉండదని.. భావించాడు ములాయం. ఈ క్రమంలోనే లక్ష్మీదేవిని కిరాతకంగా కొట్టి చంపేశాడు. ఆపై అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం సర్దార్ ఆస్పత్రికి తరలించారు. కాగా నిందితుడిని అరెస్టు చేశామని.. దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.
బాలికను రేప్ చేసిన మైనర్..
ఉత్తర్ప్రదేశ్లో మతిస్థిమితం లేని బాలికను ఓ మైనర్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పొరుగింట్లో ఉండే ఓ బాలికపై మైనర్ రేప్ చేశాడు. బాలిక గర్భం దాల్చగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.