తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Man Harasses wife in Hyderabad : 'నువ్వు చచ్చిపో.. నేను ఇంకో పెళ్లి చేసుకుంటా..!' - హైదరాబాద్ నేర వార్తలు

Husband Harasses wife in Hyderabad : తల్లిదండ్రులు మంచి అబ్బాయి అని చెప్పగానే ఆ యువతి ముందూ వెనక ఆలోచించకుండా పెళ్లి చేసుకుంది. ఎన్నో ఆశలతో తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. కానీ, ఆ ప్రబుద్ధుడు పెళ్లినాట చేసిన ప్రమాణాలు మరిచాడు. పెళ్లి అయిన కొన్నిరోజుల తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు. డబ్బు ఆశతో ఆమెను చిత్రహింసలకు గురి చేయడం మొదలుపట్టాడు. నువ్వు చనిపో.. మరో యువతిని పెళ్లి చేసుకుంటానని తరచూ నరకాన్ని చూపించాడు. అతని వేధింపులు భరించలేని ఆ మహిళ హైదరాబాద్​లోని శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది.

Husband Harasses wife in Hyderabad
Husband Harasses wife in Hyderabad

By

Published : May 26, 2023, 11:43 AM IST

Updated : May 26, 2023, 12:11 PM IST

Husband Harasses wife in Hyderabad : జీవితాంతం కష్టసుఖాల్లో తోడుంటానని అగ్ని సాక్షిగా పెద్దల సమక్షంలో భార్యతో ప్రమాణం చేశాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తనను విడిచిపెట్టి ఉండబోనని ఆమెకు మాట ఇచ్చాడు. అన్న మాటకు తగ్గట్టుగానే ఆమెను కొంతకాలం చాలా బాగా చూసుకున్నాడు. అలా ఒకరికొకరు అంటూ కొన్నేళ్లపాటు బాగానే సాగింది వారి వివాహ జీవితం. అంతసాఫీగా సాగుతోంది అనుకుంటున్న సమయంలోనే ఆ ప్రబుద్ధుడు తన అసలు రంగు బయటపెట్టాడు. ఉన్నట్టుండి అతనికి డబ్బుపై వ్యామోహం పుట్టుకొచ్చింది. డబ్బులు ఎలా సంపాదించాలో తెలియక.. ఏం చేయాలో తోచక తన భార్యని హింసించడం మొదలు పెట్టాడు.

Husband Harasses wife News : ఉన్నత చదువులు చదివిన ఆ వ్యక్తి నైతిక విలువలను వీడి డబ్బు కోసం భార్యని వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. ఎంతలా అంటే డబ్బు కోసం తన భార్య చావుని కోరె వాడిలా తయారయ్యాడు. ఏకంగా తనతోనే.. 'నువ్వు చనిపో.. నేను ఇంకో పెళ్లి చేసుకుంటా.. అప్పుడు నాకు భారీగా కట్నం వస్తుంది' అంటూ రోజు ఆమెకు వివిధ రకాలుగా నరకం చూపించసాగాడు. చిన్న పిల్లాడు ఉన్న విషయం కూడా మరిచి తన భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. డబ్బుపై ఉన్న వ్యామోహంతో తన భార్య, కుమారుడి గురించి పట్టించుకోవడం మానేశాడు. ఇదంతా ఇక్కడే జరిగితే ఆ మహిళ తన వారంతా ఉన్నారని ధైర్యం ఓ అడుగు ముందుకేసి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేది. కానీ ఏడుసముద్రాల ఆవల ఉన్న అమెరికాలో.. నా అన్న వాళ్లెవరూ లేని విదేశంలో ఆ మహిళ ఒంటరిగా తన భర్త పెడుతున్న చిత్రహింసలను భరించాల్సి వచ్చింది.

Man harasses wife for Dowry : కానీ ఎప్పుడైతే తన కుమారుడిని కూడా పట్టించుకోవడం మానేశాడో.. ఇక అప్పుడే తన భర్త తనకు అవసరం లేదని నిర్ణయించుకుంది ఆ మహిళ. ఇక వెంటనే స్వదేశానికి వెళ్లాలని నిశ్చయించుకుంది. తన భర్త నుంచి తెలివిగా తప్పించుకుని అతి కష్టం మీద స్వదేశానికి చేరుకుంది. అనంతరం శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది.

ఇన్స్‌పెక్టర్‌ ఏ.శ్రీధర్‌ కుమార్‌ తెలిపిన కథనం ప్రకారం.. శంషాబాద్‌ మండలానికి చెందిన యువతి(32)తో శంకరపల్లి మండలం మహాలింగపురానికి చెందిన ప్రవీణ్‌ రెడ్డికి 2017లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లి అయిన తర్వాత దంపతులు అమెరికాకు వెళ్లారు. అక్కడే నివాసముంటూ తమ జీవనాన్ని సంతోషంగా సాగిస్తున్నారు. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు.

అంతా బాగుంది అనుకుంటున్న సమయంలోనే ఆ ప్రబుద్ధుడికి డబ్బుపై వ్యామోహం కలిగింది. ఏం చేయాలో తెలియక భార్యని అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడం సాగించాడు. అదనపు కట్నం ఇవ్వకపోవడంతో పలుమార్లు ఆమెపై దాడి చేశాడు. ఆమెకు భోజనం, మంచినీళ్లు కూడా ఇవ్వకుండా గదిలో బంధించి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. భర్త పెట్టే హింసను ఎవరికీ చెప్పుకోలేక, అక్కడ ఎవరిని సంప్రదించాలో తెలియక తన జీవితాన్ని బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఎట్టకేలకు ధైర్యం చేసి స్వదేశం చేరుకున్న ఆ మహిళ ఇక్కడి పోలీసులను ఆశ్రయించింది. అమెరికాలో తన భర్త ఎన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేశాడో బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : May 26, 2023, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details