తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్తే పెళ్లి పెద్ద- భార్యకు దగ్గరుండి ప్రేమ వివాహం - భార్య వివాహానికి భర్త

కట్టుకున్న భార్య తనతో సంతోషంగా ఉండటం లేదని తెలుసుకున్న ఓ భర్త.. ఆమెకు రెండో పెళ్లి జరిపించాడు. ప్రేమిస్తున్న యువకుడితో భార్య వివాహం జరిపించాడు. 'నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటావో.. వారితో కలిసి ఉంటేనే నాకూ ఆనందం' అంటూ భార్య పెళ్లికి.. పెద్దగా మారాడు.

kanpur uttar pradesh
భర్తే పెళ్లి పెద్

By

Published : Oct 30, 2021, 6:41 PM IST

భార్యకు దగ్గరుండి ప్రేమ వివాహం జరిపించిన భర్త

ఉత్తర్​ప్రదేశ్​లో అనూహ్య (UP News today) వివాహం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో కలిసి భార్య వివాహాన్ని దగ్గరుండి జరిపించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏమైందంటే...

కాన్పుర్​కు (Kanpur News) చెందిన కోమల్​- పంకజ్​లకు ఆరు నెలల క్రితం వివాహమైంది. పేరుకే పెళ్లి తప్ప.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఎలాంటి సాంగత్యం లేదు. దీంతో అసలు సమస్యేంటని భార్యను ఆరా తీశాడు పంకజ్. 'నీ సంతోషం కోసం ఏదైనా చేస్తా'నని భార్యకు మాటిచ్చాడు. దీంతో విషయం చెప్పేసింది కోమల్. పింటు అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. తన కుటుంబ సభ్యులు బలవంతంగా ఈ వివాహం జరిపించారని వివరించింది. పింటుతో ఉంటేనే సుఖంగా ఉంటానని చెప్పింది.

నవదంపతులు పింటు, కోమల్

ఇదంతా విన్న పంకజ్.. కోపగించుకోలేదు. ప్రశాంతంగా సరేనన్నాడు. 'నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటావో.. వారితో కలిసి ఉంటేనే నాకూ ఆనందం' అంటూ భార్య వివాహానికి ఏర్పాట్లు చేశాడు. ముందుగా తన కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడాడు. సంప్రదాయబద్ధంగా భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత పింటు, కోమల్​కు వివాహం జరిపించారు. ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి:అత్యాచారం విఫలం.. బాలికకు నిప్పంటించి హత్య

ABOUT THE AUTHOR

...view details