Triple Talaq to Wife: పెళ్లి జరిగిన 12 గంటల్లోనే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన విస్తుపోయే ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. కట్నం కింద ఇస్తానని చెప్పిన ఏసీ, కారు, బుల్లెట్ ఇవ్వకపోవడం వల్ల ఈ దారుణానికి పాల్పడ్డాడు రుద్రపుర్లోని ఓ వ్యక్తి.
ఏం జరిగిందంటే?
కిచ్ఛా దరవూకు చెందిన నిమ్రా ఖాన్‌కు నవంబర్ 28న బిలాస్‌పుర్‌కు చెందిన శావెజ్ ఖాన్‌తో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన సాయంత్రం నిమ్రా అత్తారింటికి వెళ్లగా.. వారు ఆమెను కింద కూర్చోబెట్టి కట్నం గురించి ఎత్తి పొడుస్తూ అవమానించారు. అయితే తన తండ్రి ప్రస్తుతం కట్నం ఇచ్చుకునే పరిస్థితిలో లేడని ఆమె బదులివ్వగా.. ఆమెపై వారు చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది.
మరునాడు ఉదయం నిమ్రా సోదరులు ఆ ఇంటికి రాగా, వారి ముందే ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు శావెజ్. దీంతో నిమ్రాను తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు సోదరులు. అయినప్పటికీ అత్తింటివారు ఫోన్లో వేధిస్తుండటం వల్ల భర్త సహా 8 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది నిమ్రా.
ఇదీ చూడండి:జూదంలో భార్యను ఓడి.. ట్రిపుల్ తలాక్‌తో ఇంటి నుంచి గెంటేసి..