నల్లగా ఉన్నాననే కారణం చెబుతూ తనకు తలాక్(triple talaq case) చెప్పాడని భర్తపై కేసు నమోదు చేసింది ఓ భార్య. వివాహం జరిగిన తొమ్మిది నెలలకే విడాకులు(divorce case) ఇచ్చిన ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్ బరేలీ జిల్లాలో జరిగింది. తన భర్త ఆలం, అత్తింటివారు నల్లగా ఉన్నానని హేళన చేయటం సహా హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.
ఇదీ జరిగింది..!
ఫిర్యాదు ప్రకారం.. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఆలం అనే వ్యక్తితో ఈ ఏడాది మార్చి 7న బాధిత మహిళకు వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సుమారు 3 ఎకరాల భూమిని కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం వేధించటం ప్రారంభించారు భర్త, అత్తింటివారు. బాధితురాలి తండ్రి వద్ద మిగిలి ఉన్న భూమిని విక్రయించి రూ.10 లక్షలు తేవాలని, దాంతో కారు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఒత్తిడి చేశారు. అందుకు నిరాకరించటం వల్ల పలుమార్లు దాడి చేశాడు ఆమె భర్త. తక్కువ కట్నం తీసుకొచ్చావని వేధించేవారు. కనీసం మనిషిగా చూసేవారు కాదు. చివరకు తలాక్(triple talaq news) చెప్పి ఇంటి నుంచి పంపించేశారు.
గృహహింస, ముమ్మారు తలాక్(triple talaq case), నల్లగా ఉందని హేళన, రూ.10 లక్షల కట్నం కోసం వేధింపులు వంటి ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజీవ్ సింగ్ తెలిపారు. అన్ని విధాల సాయం చేస్తామని బాధిత మహిళకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రతి అంశాన్ని పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:మూడేళ్లుగా ఫేస్బుక్ ప్రేమ.. తనను కాదన్నాడని యాసిడ్ దాడి