తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోదరుడికి తన భార్యనిచ్చి పెళ్లి చేసిన భర్త.. 24ఏళ్ల బంధానికి తెరదించి.. - నదియా సోదరుడితో భార్యకు వివాహం

తన భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తెలిసి ఓ వ్యక్తి ఎవరూ చేయని పని చేశాడు. 24 సంవత్సరాల వారి వివాహ జీవితానికి ముగింపు పలికాడు. తన సోదరుడికి, భార్యకు వివాహం జరిపించాడు. ఈ ఘటన బంగాల్​లో వెలుగుచూసింది.

husband marriage his wife news
సోదరుడికి తన భార్యనిచ్చి పెళ్లి చేసిన భర్త

By

Published : Oct 30, 2022, 6:53 PM IST

Updated : Oct 30, 2022, 7:04 PM IST

తన సోదరుడితో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకున్న ఓ భర్త వారిద్దరికీ వివాహం జరిపించాడు. 24 సంవత్సరాల వారి వివాహ జీవితానికి ముగింపు పలికి.. ఈ పెళ్లి చేశాడు. బంగాల్​లోని నదియా జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగాల్​ శాంతిపుర్​ మున్సిపాలిటీలోని ఒకటో నంబర్​ వార్డులో నివసించే అమూల్యా దేబ్‌నాథ్‌కు, బబ్లా ప్రాంతానికి చెందిన దీపాలీ దేబ్‌నాథ్‌తో 24 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. దానికి గుర్తుగా వారికి 22 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వారి కుమారుడికి కూడా వివాహం జరిగింది. వారి కోడలు కొన్ని రోజులుగా తన పుట్టింట్లో ఉంటోంది. అమూల్యా దేబ్​నాథ్​ వృత్తిరీత్యా వేరే రాష్ట్రంలో ఉండేవాడు. ఇదే తరుణంలో దీపాలి తన భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. వారు ఏకాంతంగా గడిపే సమయంలో రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నాడు. దీన్ని సాక్ష్యాలతో సహా గ్రామస్థులకు తెలియజేశాడు. దీపాలీకి, తన సోదరుడు కిశబ్​కు ఇరుగుపొరుగు వారి ముందు వివాహం జరిపించాడు.

'గత కొన్ని నెలలుగా నా భార్య ప్రవర్తనపై అనుమానం ఉంది. ఇరుగుపొరుగు వారి నుంచి రకరకాల వార్తలు విన్నాను. అయితే గత నెలలో ఈ సందేహం ఇంకా ఎక్కువైంది. ఒకరోజు వారిద్దరూ ఏకాంతంగా ఉండగా చూశాను. వెంటనే ఆ గదికి తాళం వేసి.. ఇరుగుపొరుగు వారికి ఈ విషయాన్ని తెలియజేశాను. తరువాత పెద్దగా ఆలోచించకుండా.. వారిద్దరికీ వివాహం చేశాను' అని అమూల్యా దేబ్​నాథ్​ తెలిపాడు.

Last Updated : Oct 30, 2022, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details