తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోర్టులోనే భార్య కాలు నరికేసిన భర్త.. ఆస్తి గొడవలతో... - Husband attacks Wife in karnataka

కోర్టు ప్రాంగణంలోనే భార్య కాలిని తెగ్గోశాడు కిరాతక భర్త(Husband attacks Wife). దంపతుల మధ్య ఆర్థిక తగాదాల కేసు విచారణకు హాజరైన సమయంలోనే ఈ దాడికి ఒడిగట్టాడు ఆ వ్యక్తి.

crime news
కోర్టు ప్రాంగణంలోనే భార్య కాలిని నరికేసిన భర్త

By

Published : Sep 29, 2021, 6:48 PM IST

Updated : Sep 29, 2021, 7:21 PM IST

కోర్టు ప్రాంగణంలోనే భార్యపై దాడికి తెగబడ్డాడు ఓ కిరాతక భర్త (Husband attacks Wife). భార్య కాలిని తెగ్గోశాడు. స్పృహ కోల్పోయిన మహిళ.. అక్కడే పడిపోయింది. కర్ణాటకలోని బెళగావి జిల్లా కోర్టులో (Belgaum District Court) ఈ ఘటన జరిగింది.

కోర్టు ప్రాంగణంలో బాధిత మహిళ

విశ్రాంత జవాను శివప్ప అడకి, తన భార్య జయమాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో గత కొద్దిరోజుల నుంచి దంపతులు గొడవ పడుతున్నారు. దీనికి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ విషయమై బుధవారం జరిగిన విచారణకు వీరిద్దరూ హాజరయ్యారు.

ఆ సమయంలోనే భార్యపై దారుణంగా దాడి చేశాడు శివప్ప. కోర్టు భవన ప్రాంగణంలోనే భార్య కాలును కోసేశాడు. మహిళను బెళగావిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

Last Updated : Sep 29, 2021, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details