తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యాబిడ్డలను కాలువలోకి తోసేసిన భర్త.. ఆపై ఆత్మహత్య.. అసలేమైంది? - ప్రిన్సిపల్ హత్య

ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు పిల్లలను కాలువలో తోసేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 14 ఏళ్ల బాలిక గాయాలతో బయటపడింది. ఈ దుర్ఘటన మహారాష్ట్రలో జరిగింది. మరోవైపు, మార్క్​షీట్​ ఇవ్వలేదని కాలేజీ ప్రిన్సిపల్​పై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ పూర్వ విద్యార్థి. ఈ ఘటనలో ప్రిన్సిపల్ మరణించారు.

man pushing wife and two children into water
భార్యాబిడ్డలను కాలువలో తోసేసిన భర్త

By

Published : Feb 25, 2023, 6:04 PM IST

మహారాష్ట్ర కొల్హాపుర్​లో దారుణం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసేశాడు ఓ వ్యక్తి. అనంతరం పక్క రాష్ట్రానికి వెళ్లి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. 14 ఏళ్ల బాలిక తీవ్ర గాయాలతో బయటపడింది.
అసలేం జరిగిందంటే?
కొల్హాపుర్​లోని హస్వాడే గ్రామ పంచాయతీకి చెందిన సందీప్ అన్నాసావ్ పాటిల్‌(36)కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం సందీప్ పాటిల్ తన భార్య రాజశ్రీ పాటిల్ (32), కుమారుడు సమిత్ (8), కుమార్తె శ్రేయా పాటిల్(14)ను తీసుకుని కాగల్ ఫైవ్ స్టార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్​లో ఉన్న కాలువ వద్దకు వెళ్లాడు. కాలువలోకి ఇద్దరు పిల్లల్ని, భార్యను తోసేశాడు. ఈ క్రమంలో సందీప్ కుమార్తె శ్రేయ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ఈదుకుంటూ సాయం కోసం కేకలు వేసింది. గమనించిన గ్రామస్థులు శ్రేయను ఒడ్డుకు చేర్చి స్థానిక పీహెచ్​సీకి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రాజశ్రీ పాటిల్, సమిత్ మృతదేహాలను బయటకు తీశారు. అప్పటికే ఘటనాస్థలికి గ్రామస్థులు భారీగా చేరుకున్నారు. నిందితుడు సందీప్ పాటిల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కర్ణాటకలోని భోజ్‌లో రోడ్డుపై సందీప్ పాటిల్ బైక్ ఆపి పొలంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సందీప్​ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సందీప్ పాటిల్ ప్యాంట్ జేబులో భార్య, కుమారుడి ఆధార్ కార్డు ఉన్నాయి. సందీప్​ ఎందుకు ఇలా కుటుంబాన్ని చంపి, ఆత్మహత్యకు పాల్పడ్డాడనేది ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

ప్రిన్సిపల్​పై పెట్రోల్​ పోసి..
మధ్యప్రదేశ్​.. ఇందౌర్​లో దారుణం జరిగింది. మార్క్ షీట్​ను ఇవ్వలేదని కళాశాల ప్రిన్సిపల్​పై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ పూర్వ విద్యార్థి. ఈ ఘటనలో ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపల్ విముక్త శర్మ(54) ఐదు రోజులు కాలిన గాయాలతో పోరాడి మృతి చెందారు. కళాశాల విద్యార్థి పూర్వ విద్యార్థి అశుతోష్ శ్రీవాస్తవ(24)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు సోమవారం.. ప్రిన్సిపల్​తో గొడవపడి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. విముక్త శర్మకు 80 శాతం కాలిన గాయాలయ్యాయని వెల్లడించారు. నిందితుడు శ్రీవాస్తవపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని వెల్లడించారు.

తాను 2022 జులైలో బీఫార్మసీ పాసయ్యానని తెలిపాడు శ్రీవాస్తవ. తన మార్కుల షీట్​ను కాలేజీ అధికారుల ఇవ్వడం లేదని పోలీసులకు తెలిపాడు. మరోవైపు.. శ్రీవాస్తవ చేసిన ఆరోపణలను ఖండించింది కాలేజీ యజమాన్యం. శ్రీవాస్తవ నేర ప్రవృత్తిని కలిగి ఉన్నాడని ఆరోపించింది. మార్క్‌షీట్‌ను తీసుకెళ్లాలని పదేపదే అతడిని కోరినా అతడు తీసుకెళ్లలేదని అధికారులు తెలిపారు.

ఉద్యోగం పేరిట మోసం..
ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 43 ఏళ్ల మహిళను మోసగించారు ఇద్దరు ఏజెంట్లు. ఒమన్​లో ఇంటి పనులు చేసేందుకు పంపిస్తామని బాధితురాలిని నమ్మించారు. ఆమెను రూ.3 లక్షలను విక్రయించి.. ఒమన్​లో బలవంతంగా వ్యభిచారం చేయించారు. ఏజెంట్లు అష్రఫ్, నమితపై కాశీమీరా పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వారి ఫోన్ నంబర్లను సైతం పోలీసులకు ఇచ్చింది. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

బాధితురాలు బ్యూటీ పార్లర్ నడుపుతోంది. ఆమె ముంబయికి చెందిన అష్రఫ్‌ను 2022 జూన్​లో కలిసింది. ఒమన్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆమెను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టాడు. ఏజెంట్లు అష్రఫ్​, నమిత అనే మహిళ ఇద్దరు కలిసి బాధితురాలిని రూ.3 లక్షలకు విక్రయించి ఒమన్​కు అక్రమంగా తరలించారు.

ABOUT THE AUTHOR

...view details