తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యకు నిప్పంటించి వృద్ధుడు ఆత్మహత్య - పత్తానంతిట్ట

కేరళలోని పతనంతిట్టలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన భార్యకు నిప్పంటించడమే కాక అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో వారి కుమార్తె తీవ్రంగా గాయపడ్డారురు.

Husband commits suicide after setting wife on fire; Daughter seriously injured
భార్యకు నిప్పంటించి వృద్ధుడు ఆత్మహత్య

By

Published : Mar 21, 2021, 3:17 PM IST

కేరళలో భార్యకు నిప్పంటించిన అనంతరం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పతనంతిట్ట జిల్లా తిరువళ్ల నెడుంబరానికి చెందిన 65 ఏళ్ల మత్తుకుట్టీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతడి భార్య సారమ్మ(59)కు ఆదివారం మధ్యాహ్నం నిప్పంటించాడు. ఆమెను కాపాడబోయే క్రమంలో వారి కుమార్తె లిజీ తీవ్ర గాయాలపాలయ్యారు. లిజీని అలప్పుజలో ఓ ఆస్పత్రికి తరలించారు.

కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీంచిన అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:భార్యపై లైంగిక వేధింపులు- భర్త అరెస్ట్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details