తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గర్భిణీ భార్యకు నిప్పంటించి హత్య- డబ్బులు ఇవ్వలేదని.. - భార్యను సజీవదహనం చేసిన భర్త

Husband Burnt Pregnant Wife: అడిగిన డబ్బు ఇవ్వలేదన్న కారణంతో భార్య, పిల్లలను సజీవదహనం చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బిహార్​లోని సుపౌల్​లో జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

husband murdered
గర్భిణీ భార్యకు

By

Published : Jan 4, 2022, 8:44 PM IST

Husband Burnt Pregnant Wife: గర్భవతి అయిన భార్యను, మూడేళ్ల కుమారుడిని సజీవ దహనం చేశాడు ఓ కిరాతకుడు. ఇందుకు అతని సోదరి కూడా సహకరించింది. ఈ ఘటన బిహార్​ సుపౌల్​లోని త్రివేణీగంజ్​లో జరిగింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఆరు నెలలుగా గొడవలు..

బంధువుల వివరాల ప్రకారం.. రైల్వేలో ఉద్యోగం సంపాదించేందుకు లక్ష రూపాయలు ఇవ్వమని నిందితుడు.. భార్య రంజన దేవీని (27) డిమాండ్​ చేశాడు. ఈ విషయంపైనే గత ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన నిందితుడు గర్భిణీ అయిన భార్య, మూడేళ్ల కుమారుడి కళ్లకు గంతలు కట్టి వారిద్దరినీ మంచంపై తాళ్లతో బంధించాడు. అనంతరం వారిని సజీవ దహనం చేశాడు. ఈ దారుణానికి పాల్పడేందుకు అతని సోదరి కూడా సహకరించింది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులు కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి :'ఆయన నుంచి చాలా నేర్చుకున్నా'.. జస్టిస్ సుభాష్ రెడ్డిపై సీజేఐ ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details