Husband attacked wife On Extramarital affairs : అనుమానమే పెను భూతంగా మారింది. మద్యం మత్తు ఆయన్ను కటాకటాల్లోకి నెట్టింది. హాయిగా వెళ్లిపోతున్న ఆలుమగల జీవితాల్లో అనుమానం అనే చిన్న వైరస్ వ్యాప్తి చెంది ప్రాణాంతక వ్యాధిలా మారుతోంది. జూబ్లీహిల్స్‌లో ఇవాళ జరిగిన ఉదాంతమే ఇందుకు నిదర్శనం. భార్యపై అనుమానంతో మద్యం మత్తులో ఓ భర్త.. ఆమెపై దాడికి తెగబడ్డాడు. దీంతో హాయిగా వెళ్లాల్సిన ఆలుమగల జీవితాలు.. భార్య ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతుంటే.. భర్త పోలీసుల అదుపులో ఉన్నారు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో దారుణం చోటు చేసుకుంది. పెద్దమ్మ గుడి బస్‌స్టాప్ వద్ద బస్సు కోసం ఎదురు చుస్తోన్న ఓ మహిళను తన భర్తే మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. బీర్ బాటిల్‌తో అతి కిరాతకంగా పోడిచాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అతన్ని అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తీవ్ర గాయాలపాలైన ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
- Father killed his daughter at Nizamabad : భార్యపై కోపం.. కుమార్తెను మంటల్లో తోసి చంపిన తండ్రి
- Husband killed wife on electric shock : కరెంట్‌షాక్‌తో భార్యను చంపిన భర్త.. పోలీసుల ఎదుట కట్టుకథలు
Husband attacked his wife At Husband : దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన ఆనంద్.. నవీనాను 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు.