తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫర్టిలైజర్ కంపెనీలో ఖాళీలు.. రూ.లక్షల్లో జీతం.. ద‌ర‌ఖాస్తుకు వారమే ఛాన్స్! - ఉద్యోగ సమాచారం

HURL Recruitment 2023 : ప్ర‌ముఖ ఫర్టిలైజర్ కంపెనీ హిందుస్థాన్ ఊర్వ‌రక్ అండ్ ర‌సాయ‌న్ లిమిటెడ్​లో ఖాళీగా ఉన్న ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. దీనికి సంబంధించి ఖాళీలు, విద్యార్హ‌త‌లు, జీతం, వ‌య‌సు, ద‌ర‌ఖాస్తు విధానం వివ‌రాలివీ..!

HURL Recruitment 2023
HURL Recruitment 2023

By

Published : May 19, 2023, 9:28 AM IST

HURL Recruitment 2023 : ప్ర‌ముఖ ఫర్టిలైజర్ కంపెనీ అయిన హిందుస్థాన్ ఊర్వ‌రక్ అండ్ ర‌సాయ‌న్ లిమిటెడ్​లో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన వారి నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోంది. ఇందులో మేనేజ‌ర్, అసిస్టెంట్ మేనేజ‌ర్ ఇత‌ర పోస్టులున్నాయి. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఈ నెల 24 తుది గ‌డువు. దీనికి సంబంధించిన ఖాళీలు, విద్యార్హ‌త‌లు, జీతం, వ‌య‌సు త‌దిత‌ర పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఈ పోస్టుల‌కు మే 03వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అప్లికేష‌న్​కు చివ‌రి తేదీ మే 24. ద‌ర‌ఖాస్తు ఆన్​లైన్​లో మాత్ర‌మే చేసుకోవాలి. ఇందులో చీఫ్ మేనేజ‌ర్ నుంచి అసిస్టెంట్ మేనేజ‌ర్, ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ వ‌ర‌కు మొత్తం 25 పోస్టులున్నాయి. పోస్టును బ‌ట్టి విద్యార్హ‌త‌, జీతం ఉన్నాయి. వ‌య‌సు 30 నుంచి 55 ఏళ్లు ఉండాలి. ఆసక్తి క‌లిగిన అభ్య‌ర్థులు గ‌డువు దాట‌క ముందే అప్లై చేసుకోండి.

అభ్య‌ర్థులు దిల్లీ, బ‌రౌనీ, సింద్రి (గోరఖ్ పుర్), లాంటి వివిధ ప్రాంతాల్లో ఉన్న కంపెనీ కార్యాల‌యాల్లో ప‌ని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. దాదాపు అన్ని పోస్టుల‌కు అనుభ‌వం అవ‌స‌రం. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో ఎంపికైన వారు త‌ర్వాత త‌మ ఫిజిక‌ల్ ఫిట్​నెస్​ను నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం :
ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే వారు.. ఆన్​లైన్ ఫార‌మ్​ను నింపాల్సి ఉంటుంది. ఇది Naukri.com పోర్ట‌ల్​లో ల‌భిస్తుంది. ఈ మెయిల్‌, సంబంధిత విద్యార్హ‌త‌ల ధ్రువ ప‌త్రాలు, పాస్​పోర్టు సైజు ఫొటో అప్​లోడ్ చేయాలి. అప్లై చేసే ముందే అభ్యర్థులు కంపెనీ ష‌ర‌తులకు అంగీక‌రించాల్సి ఉంటుంది. ఏవైనా సందేహాలు త‌లెత్తిన‌ప్పుడు కంపెనీ అధికారిక ఈమెయిల్​కు మెయిల్ చేసి నివృత్తి చేసుకోవ‌చ్చు. అప్​డేట్స్ కోసం ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ ఈమెయిల్​ను చెక్ చేసుకోవాలి.

  • పోస్టులివే :
  • సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ - 01
  • వైస్ ప్రెసిడెంట్ (ప్రొడ‌క్ష‌న్‌) - 02
  • వైస్ ప్రెసిడెంట్ (టెక్నిక‌ల్ స‌ర్వీసు) - 01
  • వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) - 01
  • వైస్ ప్రెసిడెంట్ (మాన‌వ వ‌న‌రులు) - 01
  • వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) - 01
  • వైస్ ప్రెసిడెంట్ (కాంట్రాక్ట్ అండ్ మెటీరియ‌ల్స్) - 01
  • చీఫ్ మేనేజ‌ర్ - 01
  • మేనేజ‌ర్ (ఇంజినీరింగ్ స‌ర్వీసులు) - 01
  • మేనేజ‌ర్ (మెకానిక‌ల్) - 01
  • అసిస్టెంట్ మేనేజ‌ర్ (ప్రాసెస్) - 03
  • ఇంజినీర్ (ప్రాసెస్) - 03
  • ఇంజినీర్ (క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ ఇన్ స్పెక్ష‌న్ మెకానిక‌ల్) - 01
  • ఇంజినీర్ (ప్రాజెక్టు ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్) - 02
  • ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-4 లా (ఎఫ్టీసీ బేసిస్) - 01
  • ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-1 లా (ఎఫ్టీసీ బేసిస్) - 04

విద్యార్హ‌త‌లు :
పోస్టును బ‌ట్టి విద్యార్హ‌త‌లున్నాయి. దాదాపు అన్ని పోస్టుల‌కు ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. కొన్నింటికి ఎంబీఏ, బీఎస్సీ అగ్రిక‌ల్చ‌ర్ అవ‌స‌రం. సంబంధిత డిగ్రీని దాదాపు 60 శాతం మార్కుల‌తో పాసై ఉండాలి.

  • జీతం : (వార్షిక సీటీసీ)
    • సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ - రూ.48 లక్ష‌లు
    • వైస్ ప్రెసిడెంట్ - రూ.32 ల‌క్ష‌లు
    • చీఫ్ మేనేజ‌ర్ - రూ. 24 ల‌క్ష‌లు
    • మేనేజ‌ర్ - రూ. 16 ల‌క్ష‌లు
    • అసిస్టెంట్ మేనేజ‌ర్ - రూ. 11 ల‌క్ష‌లు
    • ఆఫీస‌ర్ లేదా ఇంజినీర్ - రూ. 7 ల‌క్ష‌లు

ABOUT THE AUTHOR

...view details