మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది ఓ పులి. మనుషుల రక్తానికి రుచి మరిగిన ఆ మృగం ఇప్పటి వరకు 15 మందిని పొట్టనపెట్టుకుంది. దానిని పట్టుకునేందుకు ప్రత్యేక పులల సంరక్షణ దళం, రాపిడ్ రెస్క్యూ టీం సంయుక్తంగా ఆపరేషన్ను ప్రారంభించాయి.
" పులి కోసం రోజుకు 40 కిలోమీటర్ల మేరా అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాం. కానీ, ఇప్పటి వరకు దానిని గుర్తించలేకపోయాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మా ఆపరేషన్ క్లిష్టంగా మారింది. ఈ ప్రాంతంలో చాలా పులులు ఉన్నందున.. మనుషులను వేటాడుతున్న మృగాన్ని గుర్తించటం కొంత సవాలుగా మారింది. ఈ ప్రాంతంలో 150 వరకు కెమెరా ఉచ్చులను ఏర్పాటు చేశాం. "