తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉసురుతీసిన దారిద్ర్యం .. పేదరికాన్ని భరించలేక మహిళ ఆత్మహత్య - పేదరికం అనుభవిస్తున్న మహిళ ఆత్మహత్య వార్తలు

hungry woman hangs herself: దుర్భర జీవనం, కనీస సరకులు కొనుక్కోలేని పేదరికంలో ఉన్న ఓ మహిళ తనను తాను చంపుకుంది. పేదరికాన్ని తట్టుకోలేక, అందులో నుంచి బయటపడలేక ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో చోటు చేసుకుంది.

Hunger stricken woman hangs
ఉసురుతీసిన దారిద్ర్యం

By

Published : Jan 15, 2022, 8:02 PM IST

hungry woman hangs herself: కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న 22 ఏళ్ల మహిళ.. గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడింది. కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఆమె.. ఫ్యాను సీలింగ్​కు ఉరివేసుకొని ఊపిరి తీసుకుంది. గురువారం(జనవరి 13న) ఈ ఘటన జరిగింది.

Poor Mother Suicide in Madhya Pradesh

మధ్యప్రదేశ్​లోని బేతుల్ జిల్లాలో రింకీ పార్దీ, ఆమె భర్త రాజ్​కుమార్​ తమ 17 నెలల శిశువుతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరి కుటుంబం ఆర్థికంగా కుంగిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేక ఏడు రోజులుగా ఏమీ తినకుండా ఉండిపోయింది రింకీ. సరకుల కోసం రాజ్​కుమార్ రేషన్ దుకాణానికి వెళ్లిన సమయంలో ఆత్మహత్య చేసుకుంది మహిళ.

Woman Suicide MP

రేషన్ బియ్యం కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని, పార్దీ సామాజిక వర్గం నుంచి వచ్చినందున తమను ఎవరూ పనిలోకి తీసుకోలేదని రాజ్​కుమార్ వాపోయాడు. "భిక్షాటన చేసి కడుపు నింపుకోవాలని భావించాం. నా భార్య భిక్షాటనకు వెళ్లినా... ఫలితం లేదు. మాకు ఆహారమేమీ సరిగా దొరకలేదు" అని అన్నారు.

ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 'మృతి చెందిన మహిళ మానసికంగా దెబ్బతింది. ఆర్థిక పరిస్థితుల వల్లే ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె కడుపులో ఆహారం ఆనవాళ్లు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది' అని బేతుల్ ఎస్​డీపీఓ నితేశ్ పటేల్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:స్కూళ్లలోకి ఆ పిల్లలకు నో ఎంట్రీ- ప్రభుత్వం హెచ్చరిక!

ABOUT THE AUTHOR

...view details