Human Skeletons Found odisha: ఒడిశాలోని భువనేశ్వర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పటియా బ్రిడ్జి కింద భారీస్థాయిలో మానవ అస్థిపంజరాలు, పుర్రెలు, ఎముకలు లభ్యమయ్యాయి. వీటిని గోనె సంచుల్లో పెట్టి బ్రిడ్జి కింద పడేసినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 12కు పైగా పుర్రెలు, కొన్ని అస్థిపంజరాలు, భారీగా ఎముకలు ఉన్నట్లు పేర్కొన్నారు.
పుర్రెలు, అస్థిపంజరాల కలకలం- భయాందోళనలో జనం! - Human Skeletons Found odisha
Human Skeletons Found odisha: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో భారీస్థాయిలో మానవ పుర్రెలు, అస్థిపంజరాలు లభ్యం అయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

human-skeletons-found-dumped-under-bridge-in-bhubaneswar
ఈ ఘటన తెలిసిన వెంటనే మంచేశ్వర్ స్టేషన్ పోలీసులు, సాంకేతిక బృందం ఘటనాస్థలికి చేరుకుంది. మానవ అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఎయిమ్స్‌కు తరలించింది. ఈ అస్థిపంజరాలు చాలా ఏళ్ల క్రితం నాటివి అని భావిస్తున్నట్లు ఏసీపీ సంజీబ్ సత్పతీ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టామన్నారు.