Human Sacrifice In Odisha: ఒడిశా కలహండిలో అమానుష ఘటన జరిగింది. వృద్ధుడిని బలి ఇస్తే గుప్తనిధులు దొరుకుతాయనే నమ్మకంతో సొంత తండ్రినే హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించి వృద్ధుడిని రక్షించారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
గుప్తనిధుల కోసం తండ్రినే బలి ఇవ్వబోయిన కుమారుడు - ఒడిశా నరబలి న్యూస్
Human Sacrifice In Odisha: వృద్ధుడిని బలి ఇస్తే గుప్తనిధులు దొరుకుతాయనే నమ్మకంతో సొంత తండ్రినే హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. ఈ అమానుష ఘటన ఒడిశాలోని కలహండిలో జరిగింది.
కలహండి జిల్లాలోని జైపట్నా బేలపాడ గ్రామానికి చెందిన లింగరాజ్ భోయ్(30) అనే యువకుడు చిన్న విషయాలకే తన తండ్రి బాలదేవ్ భోయ్ను దారుణంగా హింసించేవాడు. దీంతో లింగరాజ్ భార్య కూడా విడిచిపెట్టి వెళ్లిపోయింది. వృద్ధుడిని బలి ఇస్తే గుప్త నిధులు లభ్యమవుతాయని ఓ పూజారి చెప్పాడు. అది నమ్మిన లింగరాజ్ శుక్రవారం తన తండ్రిని బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. బావి వద్దకు తీసుకవెళ్లి స్నానం చేయించి.. కొత్త బట్టలు తొడిగించి.. పూలదండలు వేసి సిద్ధం చేశాడు. అనంతరం పూజారి ఇంట్లో బలి ఇవ్వడానికి పూజను ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపేందుకు యత్నించగా.. వారిపై ఇనపరాడ్లు, గొడ్డళ్లతో లింగరాజ్ దాడి చేశాడు. అయితే.. పోలీసులు చాకచక్యంగా అతడ్ని పట్టుకుని స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి:సెక్యూరిటీ గార్డును చెట్టుకు వేలాడదీసి.. ఇనుప రాడ్లతో దాడి!