అసోంలోని సరిహద్దు నగరం మొరేహ్లో నిషేధిత మాదకద్రవ్యాలు, ఆయుధాలు అక్రమంగా రవాణా చేసే ముఠాల గుట్టురట్టు చేశారు అధికారులు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అసోం రైఫిల్స్ విభాగం, మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు, రాష్ట్ర పోలీస్ బృందాలు మణిపుర్ సరిహద్దు ప్రాంతాల్లో సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.
రూ.165 కోట్ల డ్రగ్స్, ఆయుధాలు పట్టివేత - మత్తు పదార్థాల అక్రమ రవాణా
అసోంలో సుమారు రూ.165 కోట్లు విలువైన నిషేధిత మత్తు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అక్రమ రవాణా ముఠాలకు చెందిన ఆరుగురిని పట్టుకున్నారు.
మాదక ద్రవ్యాలు, ఆయుధాల స్వాధీనం
రెండు ప్రాంతాల్లో అక్రమ రవాణా ముఠాలకు చెందిన ఆరుగురిని పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి భారీగా నిషేధిత మత్తు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.165 కోట్లు ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి: అసోంలో రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం