తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల వేళ భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం! - బంగాల్ ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలకు(West Bengal By Election 2021) గడువు సమీపిస్తున్న వేళ.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవ్వడం బంగాల్​లో కలకలం సృష్టించింది. బీర్​భూమ్​ జిల్లాలో(West Bengal birbhum News) ఓ వాహనంలో వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

west bengal explosive materials
బంగాల్​లో పేలుడు పదార్థాలు

By

Published : Oct 21, 2021, 6:31 PM IST

బంగాల్​ బీర్​భూమ్​ జిల్లాలో(West Bengal birbhum News) బుధవారం రాత్రి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామ్​పుర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని​ మఝ్​ఖండా గ్రామ సమీపంలో రహదారిపై నిలిపి ఉన్న ఓ వాహనంలో వీటిని పట్టుకున్నారు. అక్టోబరు 30న బంగాల్​లో పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో(West Bengal By Election 2021) ఈ పేలుడు పదార్థాలు లభ్యమవ్వడం స్థానికంగా కలకలం సృష్టించింది.

వాహనంలో నుంచి 2,600 డిటోనేటర్లు, 5,500 జిలెటిన్ స్టిక్స్​ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనాన్ని గుర్తించిన సమయంలో అందులో ఎవరూ లేరని చెప్పారు. సదరు వాహన యజమాని, డ్రైవర్​ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టామని ఎస్పీ నాగేంద్ర త్రిపాఠి తెలిపారు.

ఇదీ చూడండి:బస్సులో నుంచి జారి పడి మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details