తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మానవ అక్రమ రవాణా కేసులో 38 మంది అరెస్ట్ - మానవ అక్రమ రవాణా కేసు

మంగళూరులో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు అయింది. శ్రీలంకకు చెందిన 38 మందిని మంగళూరు పోలీసులు పట్టుకున్నారు. వీరిని విచారించి కోర్టులో హాజరు పరుస్తామని మంగళూరు సిటీ కమిషనర్ తెలిపారు.

human trafficking
మానవ అక్రమ రవాణా

By

Published : Jun 11, 2021, 4:57 PM IST

మానవ అక్రమ రవాణా కేసులో శ్రీలంకకు చెందిన 38 మందిని మంగళూరు పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిని విచారించి కోర్టులో హాజరు పరుస్తామని మంగళూరు సిటీ కమిషనర్ శశికుమార్ తెలిపారు. 39 మందిని శ్రీలంక నుంచి కెనడాకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని శశికుమార్ తెలిపారు. వీరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తీసుకుని ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నట్లు వెల్లడైందన్నారు.

మొదట 39 మంది శ్రీలంక దేశస్థులు.. తమిళనాడులోని తూత్తుకుడికి పడవలో వచ్చారని.. ఎన్నికల దృష్ట్యా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం వల్ల మంగళూరు వచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం 38 మందిని అరెస్ట్ చేశామని.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి :సీఆర్​పీఎఫ్​ సిబ్బందిపై ఉగ్రవాదుల కాల్పులు!

ABOUT THE AUTHOR

...view details