రైళ్లలో సిగరెట్, బీడీలు తాగే వ్యక్తులకు భారీ జరిమానా విధించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎస్-5 బోగీ మంటల్లో చిక్కుకోవడానికి సిగరెట్ లేదా బీడీ కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
రైళ్లలో సిగరెట్లు తాగితే భారీ జరిమానా!
రైళ్లలో సిగరెట్లు, బీడీలు తాగే వ్యక్తులకు భారీ జరిమానా విధించేందుకు రైల్యేశాఖ సిద్దమవుతోంది. కొద్దిరోజుల క్రితం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగికి మంటలు అంటుకోవడానికి సిగరెట్ కారణమని ప్రాథమిక నివేదికలు తేల్చాయి. దాంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 13న న్యూదిల్లీ- దెహ్రాదూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఎస్5 బోగీలో మంటలు చెలరేగాయి. శౌచాలయం లోని చెత్తబుట్టలో గుర్తు తెలియని వ్యక్తులు బీడీ వేయడం వల్లే మంటలు చెలరేగినట్లు విచారణ జరిపిన అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇటీవల రైల్వే మంత్రి నిర్వహించిన సమావేశంలో రైళ్లలో పొగతాగకుండా చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు సభ్యులు సూచించారు. ఈ నేపథ్యంలో భారీ జరిమానా విధించే విషయంలో ఆలోచన చేస్తున్నామని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లినప్పుడు, తోటి ప్రయాణికులను ప్రాణాలను పణంగా పెట్టే వ్యక్తులను అరెస్టు చేసే విషయమై యోచిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రైళ్లలో పొగతాగితే 100 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారు.
ఇదీ చదవండి:'టీ పరిశ్రమను నాశనం చేసే వారితో కాంగ్రెస్ జట్టు'