తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Shirdi Sai Donations: గురు పూర్ణిమకు శిర్డీకి పోటెత్తిన భక్తులు.. రూ.7 కోట్లు విరాళాలు - శిర్డీ సాయి వార్తలు

Donations to Shirdi Sai: గురు పూర్ణిమ సందర్బంగా శిర్డీకి సాయికి విరాళాల ద్వారా భారీ ఆదాయం సమాకూరింది. వివిధ రూపాల్లో సమాకూరిన ఆదాయాన్ని.. గురుపూర్ణిమ సందర్భంగా విచ్చేసిన భక్తులు వివిధ రూపాల్లో విరాళాల ద్వారా సమర్పించారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు.

Shirdi Sai
శిర్డీ సాయి

By

Published : Jul 5, 2023, 5:58 PM IST

Huge Donations to Shirdi Sai: గురు పూర్ణిమ ఉత్సవాలను పురష్కరించుకుని శిర్డీ సాయి బాబా ఆలయానికి సూమారు 7 కోట్ల ఆదాయం విరాళాల ద్వారా సమాకూరింది. సాయి బాబాను గురువుగా భావించే భక్తులు.. ఈ విరాళాలను అందించారు. ఈ సంవత్సరం గురుపూర్ణిమ ఉత్సవాలకు 2లక్షల మంది స్వయంగా సాయి సమాధిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. గురు పూర్ణిమ రోజు భక్తుల తాకిడికి ఆ ప్రదేశం కిటకిటలాడింది. గురు పూర్ణిమను పురష్కరించుకుని భక్తులు 3రోజుల్లో వివిధ రూపాల్లో అందించిన విరాళాన్ని లెక్కించారు.

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆదాయం రూ.3 కోట్ల మేరకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆదాయం.. 7 కోట్ల 3 లక్షల 57,248 రూపాయల వరకు సమకూరింది.

  • దక్షిణ పెట్టెలో నగదు రూపంలో 2 కోట్ల 85 లక్షల 46,882 రూపాయలు
  • డొనేషన్ కౌంటర్ ద్వారా ఒక కోటి 15లక్షల 84,150 రూపాయలు
  • ప్రసాదాల ద్వారా 2 లక్షల 84,946 రూపాయలు
  • పీఆర్వో శుల్క్ పాస్ ద్వారా 67 లక్షల 33 వేల రూపాయలు
  • డెబిట్, క్రెడిట్ కార్డ్​ల ద్వారా 56 లక్షల 83 వేలు 133 రూపాయలు
  • ఆన్‌లైన్​లో విరాళం 64 లక్షల 05 వేల 78 రూపాయలు
  • చెక్కులు, డీడీల ద్వారా విరాళం 80 లక్షల 74 వేలు 820 రూపాయలు
  • మనీ ఆర్డర్ రూపంలో 2 లక్ష 09 వేల 05 రూపాయలు
  • Guru Purnima Shirdi 2023 : గురు పూర్ణిమకు ముస్తాబైన శిర్డీ.. మూడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు

గురు పూర్ణిమ సందర్భంగా నిర్వహించిన మూడు రోజుల మహోత్సవాల్లో భాగంగా దాదాపు 7 కోట్ల రూపాయల ఆదాయం సమాకూరిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.శివ శంకర్ తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదాయం పెరిగినట్లు ఆయన వివరించారు. గురు పూర్ణిమ సందర్భంగా వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగలేదని.. అవాంఛనీయ ఘటనలు కూడా ఏమి చోటు చేసుకోలేదని ఆయన తెలిపారు.

గురు పూర్ణిమ సందర్బంగా శిర్డీ సాయికి 7 కోట్ల రూపాయల విరాళాలు

"ఈ సంవత్సరం గురు పూర్ణిమ సందర్భంగా మూడు రోజుల మహోత్సవాల్లో భక్తుల ద్వారా దాదాపు 7కోట్ల రూపాయల వరకు విరాళాలు వచ్చాయి. గత సంవత్సరం నాలుగున్నర కోట్ల విరాళాలు వచ్చాయి. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం విరాళాలు సుమారు 2కోట్ల 60లక్షల మేర పెరిగాయి." -పి.శివ శంకర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

ABOUT THE AUTHOR

...view details