తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు, నెల రోజుల్లో సుమారు 500 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం - తెలంగాణలో నెల రోజుల్లో ఎంత నగదు పట్టుకున్నారు

Huge Amount of Money Seized in Telangana : ఎన్నికల వేళ తనిఖీల్లో భారీగా సొత్తు పట్టుబడుతోంది. నోట్ల కట్టలు, బంగారం, మద్యం విచ్చలవిడిగా జప్తు చేస్తున్నారు. నోటిఫికేషన్ కంటే ముందే గత ఎన్నికల రికార్డుల స్వాధీనాల మొత్తం అధిగమించింది. స్వాధీనం చేసుకున్న సొత్తు ఇప్పటికే సుమారు రూ.500 కోట్లకు చేరింది. ప్రలోభాల అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఉదాసీనత తగదంటూ అధికారులను తీవ్రంగా హెచ్చరించింది. తనిఖీలు మరింత ఉద్ధృతం చేయాలని.. అక్రమాలకు తావు లేకుండా చూడాలని పదేపదే స్పష్టంచేస్తోంది. ఈ ప్రక్రియలో సామాన్యులు, వ్యాపారులు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు ఇబ్బంది పడుతున్న సందర్భాలూ లేకపోలేదు.

Police Seized Money 2023 Elections
Police Seize Huge Gold and Money in Telangana

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 5:38 AM IST

Huge Amount of Money Seized in Telangana: ఎన్నికలొచ్చిన ప్రతీసారి ప్రలోభాల అంశం ప్రస్తావనకు వస్తుంది. పనితీరు, హమీలతో ఓటరు దేవుణ్ని ప్రసన్నం చేసుకొని మద్దతు పొందాల్సిన రాజకీయ పార్టీలు, నేతలు.. ప్రలోభాల సాయంతో గెలవాలని చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ తంతు ఒకప్పుడు రహస్యంగా సాగినా.. ప్రస్తుతం బాహాటంగానే నడుస్తోంది. ఆన్‌లైన్, డిజిటల్ లావాదేవీలు కలిసొచ్చాయి. డబ్బులు పంపిణీ చేస్తుంటే ఫిర్యాదు చేయడం, పట్టించాల్సింది పోయి.. డబ్బులు ఇవ్వలేదని బహిరంగంగానే మాట్లాడడం, ఆందోళనలకు దిగే వరకు పరిస్థితి వచ్చింది. దేశంలోనే ఖరీదైన ఎన్నికలు ఎక్కడంటే తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పే పరిస్థితి వచ్చిందని సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల సంఘమే వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది. ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష కోసం హైదరాబాద్ వచ్చిన ఈసీ.. అధికారులతో ప్రలోభాలు, స్వాధీనాల విషయాన్ని పదేపదే ప్రస్తావించింది. తనిఖీల్లో ఉదాసీనత వీడాలంటూ ఘాటుగా హెచ్చరించింది.

Police Check Posts in Telangana: తెలంగాణ ఎన్నికల వేళ కేంద్ర, రాష్ట్ర బృందాలు సంయుక్తంగా పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నాయి. తొలిసారి అటవీ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. నగదు, మద్యం కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా 148 తనిఖీ కేంద్రాలు(Check Posts in Telangana) పనిచేస్తున్నాయి. ఎన్నికల్లో నగదు ప్రవాహ నియంత్రణ విషయంలో సోదాలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశాలు ఇచ్చాం. పట్టుబడ్డ వ్యక్తుల నుంచి సొమ్ము స్వాధీనం చేసుకోవడమే కాక.. దాని వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకోవాలని సూచించాం. మద్యం, మాదకద్రవ్యాల సరఫరాలో ఎవరి ప్రమేయం ఉందో కనిపెట్టాలని చెప్పాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమన్వయం చేసుకుని పనిచేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నెల రోజుల్లో 453 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

Police Seize Huge Amount of Gold and Money: కేంద్ర ఎన్నికల సంఘం అదేశాలు, హెచ్చరికలతో రాష్ట్రంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈసీ సమీక్ష ముగిసిన మరుసటి రోజు నుంచే డబ్బు, మద్యం, ఇతరత్రాల స్వాధీనం ప్రారంభమైంది. వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొని పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులను ఈసీ బదిలీ చేసింది. ఆ ప్రభావం తనిఖీలు, స్వాధీనాలపైనా పడింది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే సరిహద్దుల్లో 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు(Inspections in Telangana) ముమ్మరం చేశారు. సరైన వివరాలు లేని నగదు, ఆభరణాలతో పాటు అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యం, కానుకలు, గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు. భారీ ఎత్తున స్వాధీనమైన సొత్తు మొత్తం ఇప్పటికే గత ఎన్నికల రికార్డును ఎప్పుడో అధిగమించింది. ఈనెల తొమ్మిదో తేదీ నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ.500 కోట్లు దాటిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌(Vikash Raj) స్పష్టం చేశారు.

Police Seized Money 2023 Elections : 2018 ఎన్నికల్లో రూ.97 కోట్ల నగదు, రూ.2 కోట్లవిలువైన మద్యం, రూ.42 లక్షల విలువైన మత్తు పదార్థాలు, రూ.3 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ.137.97 కోట్లు మాత్రమే. అప్పటితో పోల్చితే ఈసారి స్వాధీనం చేసుకున్న సొత్తు ఇప్పటికే మూడు రెట్లు దాటిపోయింది. నామినేషన్ల ఘట్టం, ప్రచారం, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇంకా ఎంత మొత్తం జప్తు చేశారో చూడాలి. ఎన్నికల నియమావళి(Election Code) పేరిట తాము ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరాలు, వ్యాపారం కోసం తీసుకెళ్తున్న నగదు స్వాధీనం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజువారీ లావాదేవీలు, బ్యాంకులకు వెళ్తున్న సమయంలో తమ వద్ద ఉన్న నగదు స్వాధీనం చేసుకుంటున్నారని మద్యం దుకాణదారులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఆభరణాలు అన్నింటికీ రసీదులు ఉండబోవని, వాటిని స్వాధీనం చేసుకోవడం ఉపాధి దెబ్బతింటుందని స్వర్ణకారులు వాపోతున్నారు.

Police Seize Huge Amount of Gold and Money : రాష్ట్రంలో కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు.. ఇప్పటివరకు రూ. 300 కోట్లకు పైగా జప్తు

Election Code in Telangana : శాంతిభద్రతల పరంగానే కాకుండా ఎన్నికల ఖర్చు విషయంలోనూ సమస్యాత్మక నియోజకవర్గాలుగా పరిగణిస్తూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పెద్దమొత్తం లావాదేవీలు, ఆన్‌లైన్, డిజిటల్ లావాదేవీలపైనా నిఘా ఉంచారు. బ్యాంకుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. వారితో పదేపదే సమావేశాలు నిర్వహిస్తూ సమన్వయం చేసుకుంటున్నారు.

Each Person Carry 50 Thousand Rupees Only: ఒక వ్యక్తి వద్ద రూ.50వేల వరకు నగదు ఉంటే ఎలాంటి ఆధారాలు, పత్రాలు అవసరం లేదు. అంతకుమించి ఉంటే మాత్రం ఆధారాలు, పత్రాలు చూపాల్సి ఉంటుంది. బ్యాంకు, ఏటీఎం నుంచి విత్ డ్రా చేస్తే.. స్లిప్పులు.. ఆసుపత్రులు తదితర అత్యవసర పనుల కోసమైతే.. సంబంధించిన వివరాలు చూపాల్సి ఉంటుంది. తనిఖీల సమయంలో ఆధారాలు, పత్రాలు ఉన్నా.. పది లక్షలకుపైగా నగదు ఉంటే మాత్రం వెంటనే ఆ సమాచారాన్ని ఆదాయపన్ను శాఖకు చేరవేస్తారు. ఒకరి నుంచే ఎక్కువ మందికి చెల్లింపులు జరిగినా.. పదేపదే అనుమానాస్పద లావాదేవీలు జరిగినా వెంటనే గుర్తించి వాటి గురించి ఆరా తీస్తారు.

Police Seize 17 KG Gold in Miyapur : మియాపూర్​లో 17 కిలోల బంగారం, కవాడిగూడలో 2.09 కోట్ల నగదు స్వాధీనం

Huge Amount of Money Seized in Telangana : పాత రికార్డులన్నీ ఢమాల్​.. పోలీసుల తనిఖీల్లో రూ.243 కోట్లు సీజ్

ABOUT THE AUTHOR

...view details