తమిళనాడులోని ఓ పురాతన ఆలయ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా.. భారీగా బంగారం బయటపడింది. ఈ సంఘటన కాంచీపురం జిల్లా ఉత్తీరమీరుర్లో జరిగింది.
గ్రామంలో రెండో కులోతుంగ చోళ కాలానికి చెందిన ఓ పురాతన కులంబేశ్వర ఆలయం ఉంది. దేవాలయ ఉత్సవ కమిటీ ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందుకోసం.. దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న నల్లరాతి మెట్లను తొలగింపు పనులు చేపట్టింది. పనులు జరుగుతుండగా.. వారికి వస్త్రంతో చుట్టిన ఓ మూట కనిపించింది. ఆ మూటను విప్పి చూస్తే.. బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి.
అయితే.. తమ అనుమతి లేకుండా 500 ఏళ్లనాటి ఆలయ భాగాల్ని పడగొట్టారనే విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు.. గ్రామానికి చేరుకున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు.