How to Use Umang App and its Features :ఒకప్పుడు ఎలాంటి ప్రభుత్వ సేవ పొందాలన్నా.. ఆయా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఒకవేళ మనం పనులు వదులుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన ఆ రోజు ఆఫీసర్స్ ఉంటారనే నమ్మకం లేదు. దాంతో ఏదైనా పని పూర్తి కావడానికి రెండు మూడు రోజులు పట్టేది. అయితే.. నేడు అలాంటి పరిస్థితి లేదు. టెక్నాలజీ పెరిగాక ఎలాంటి పని అయినా నిమిషాల్లో జరిగిపోతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం(Central Government) 'UMANG' అనే యాప్ ప్రవేశపెట్టింది. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ ఇలా మొత్తం 13 స్థానిక భాషలలో ఈ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఉమాంగ్ యాప్ అంటే..?
What is UMANG App : UMANG అంటే Unified Mobile Application for New-age Governance. ఈ యాప్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సేవలన్నింటిన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చాయి. రకరకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఇబ్బందులు పడే బదులు ఈ ఒక్క యాప్ మీ ఫోన్లో ఉంటే అనేక రకాల ప్రభుత్వ సేవలను పొందవచ్చు. మరి, ఉమాంగ్ యాప్‌లో మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? దానిని ఎలా ఉపయోగించాలి? దాని ద్వారా ఎలాంటి సేవలు పొందవచ్చు? వంటి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
How To Use Umang App in Telugu :
ఉమాంగ్ యాప్ ఎలా ఉపయోగించాలంటే..?
- మొదట Google Play Store లేదా Apple App Store నుంచి Umang యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీ పేరు, మొబైల్ నంబర్, వయస్సు వంటి వ్యక్తిగత వివరాలను అందించడం ద్వారా 'ప్రొఫైల్'ని క్రియేట్ చేసుకోవాలి.
- ప్రొఫైల్ ఫొటోను అప్‌లోడ్ చేసుకోవాలి.
- మీ ఆధార్ నంబర్‌ను యాప్, ఇతర సోషల్ మీడియా ఖాతాలకు కూడా లింక్ చేసుకోవచ్చు.
- మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయ్యి సేవలు, వర్గాలను బ్రౌజ్ చేయడానికి 'Sort & Filter' విభాగానికి వెళ్లాలి.
- ఆ తర్వాత మీకు కావాల్సిన నిర్దిష్ట సేవల కోసం Search optionకి వెళ్లాలి.
మొబైల్ నంబర్ ఉపయోగించి ఉమాంగ్ యాప్‌లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..
How To Register Umang App Using Mobile Number :
- మీరు ముందుగా ప్లే స్టోర్ నుంచి UMANGయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ఈ యాప్‌కి లాగిన్ చేసి New Userపై క్లిక్ చేయాలి.
- అనంతరం రిజిస్ట్రేషన్ ఆప్షన్‌లోకి వెళ్లి అక్కడ ఉన్న ప్రొసీడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయమని అడగుతుంది. అక్కడ దానిని నమోదు చేయాలి.
- ఈ ప్రక్రియ తర్వాత మీరు MPINని సెట్ చేయాలి. అప్పుడు MPINని అడిగిన ప్లేస్‌లో నమోదు చేసి దాన్ని నిర్ధారించుకోవాలి. అనంతరం Proceed ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఒక వేళ ఆధార్ నంబర్ లింక్ చేయాలనుకుంటే దాన్ని నమోదు చేయాలి. లేదా ప్రొపైల్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌కి వెళ్లడానికి Skipపై క్లిక్ చేయాలి. అప్పుడు మీరు ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
- అక్కడ మీ వివరాలను నమోదు చేసి.. 'Save & Proceed' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
- చివరిగా మీరు e-KYC ప్రక్రియను కూడా పూర్తి చేసి ఉపయోగించుకోవచ్చు.
Umang App Features and Benefits :