How to Download Rajmarg Yatra App Online :మనం సాధారణంగా ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్తున్నప్పుడు.. రూట్ కోసం గూగుల్ మ్యాప్ వాడుతుంటాం. అయితే.. ఒక్కోసారి ఇది సరైన మార్గాన్ని చూపించకపోవచ్చు. ఇలాంటప్పుడు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం(Central Government)సరికొత్త యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి, ఇంతకీ ఏంటీ ఆ యాప్? ఫీచర్స్ ఏంటి? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Rajmarg Yatra App Details in Telugu :ఈ యాప్ జాతీయరహదారుల్లో ప్రయాణించేవారికి ఉద్దేశించినది. నేషనల్ హైవేలపై జర్నీ చేసే వారికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా.. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) "రాజ్‌మార్గ్ యాత్ర" పేరుతో ఈ యాప్‌ను విడుదల చేసింది. 'సిటిజన్-సెంట్రిక్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్'ని రూపొందించే ప్రయత్నంలో భాగంగా.. దీనిని తీసుకొచ్చినట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఈ యాప్ ద్వారా వాహనదారులు.. చాలా ఈజీగా రహదారుల సమాచారం తెలుసుకుంటారు. ఎన్‌హెచ్‌ఏఐలకు సంబంధించిన సమస్యల గురించి ఫిర్యాదు కూడా చేయొచ్చు. ప్రస్తుతం ఈ యాప్ హిందీ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ప్లే స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
How to Download Rajmarg Yatra App For iOs Users in Telugu :
ఐఓఎస్ యూజర్లు రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?
- మీరు మొదట మీ iOS సపోర్టింగ్ ఫోన్లో యాప్ స్టోర్‌ని ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత సెర్చ్ బార్‌లో 'రాజ్‌మార్గ్ యాత్ర యాప్' అని ఎంటర్ చేయాలి.
- అప్పుడు మీరు GET ట్యాబ్‌ని క్లిక్ చేస్తే.. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.
- ఇలా మీరు ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈజీగా రహదారులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
How to Download Rajmarg Yatra App for Android Users in Telugu :
ఆండ్రాయిడ్ యూజర్లు రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండిలా..
- మొదట మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో Google Play Store యాప్‌ని ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత సెర్చ్ బాక్స్‌లో "రాజ్‌మార్గ్ యాత్ర"ని ఎంటర్ చేయాలి. ఆపై రాజ్‌మార్గ్ యాత్ర యాప్ డౌన్‌లోడ్ ట్యాబ్ కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
- ఇలా మీరు దీనిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా దీంట్లో రహదారులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందవచ్చు.