How To Stop Car Windshield Crack From Spreading :కారును ఎంతో ఇష్టంతో కొనుగోలు చేస్తారు. చిన్న గీత పడినా తట్టుకోలేరు. అలాంటి కారు విండ్‌షీల్డ్‌పై ఉన్నట్టుండి పగుళ్ల ఆనవాళ్లు కనిపిస్తే.. ఎలా ఉంటుంది? హృదయం ముక్కలవుతుంది! అసలు.. ఈ పగుళ్లు ఎందుకు వస్తాయంటే.. రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు చిన్న చిన్న రాళ్లు గ్లాస్‌పై పడుతూ ఉంటాయి. ఇలా సమస్య మొదలవుతుంది.
సాధారణంగా కారు విండ్‌షీల్డ్‌పై పగుళ్లు మొదట చాలా చిన్నవిగా ఉంటాయి. కొన్ని సార్లు ఇవి కనపడక పోవచ్చు కూడా! రోజులు గడిచేకొద్దీ విండ్‌షీల్డ్‌పై పగుళ్లు విస్తరిస్తూ ఉంటాయి. అయితే.. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మొదట్లో చిన్నగా ఏర్పడ్డ పగుళ్లు.. ఆ తర్వాత పెద్దగా విస్తరించి, చివరికి పగిలిపోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా.. ఈ పగుళ్లను ఎక్కువ కాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పగుళ్లను తగ్గించడానికి కొన్ని చిట్కాలు..
సూపర్ గ్లూ (Superglue) :
సూపర్‌గ్లూ ఇప్పుడు మార్కెట్లో విస్తృతంగా లభిస్తోంది. ఇది పగిలిన వస్తువులను త్వరగా అతికించడానికి చాలా బాగా పనిచేస్తుంది. పగిలిన విండ్‌షీల్డ్‌పై సూపర్‌గ్లూని ఉపయోగించడం వల్ల పగుళ్లు మరింతగా విస్తరించకుండా ఉంటాయి. సూపర్‌గ్లూను ఉపయోగించే ముందు విండ్ షీల్డ్‌పై పగుళ్లు వచ్చిన ప్రదేశాన్ని ఆల్కహాల్, గ్లాస్ క్లీనర్లు లేదా సబ్బు నీటితో శుభ్రం చేసి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తరవాతే పగుళ్లు వచ్చిన చోట సూపర్‌గ్లూను అప్లై చేయాలి.
నెయిల్ పాలిష్‌లు (Nail Polish) :
సూపర్‌గ్లూ మాదిరిగా నెయిల్ పాలిష్ కూడా విండ్‌షీల్డ్‌పై వచ్చే పగుళ్లను పెద్దవిగా కాకుండా పని చేస్తాయి. పగుళ్లను నివారించడం కోసం కలర్‌లెస్ నెయిల్ పాలిష్‌లను ఉపయోగించాలి. ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పగుళ్లపై నెయిల్ పాలిష్‌ను ఉపయోగించడం వల్ల అవి అతక్కుపోతాయి. దీని వల్ల పగుళ్లు మరింత విస్తరించకుండా ఉంటుంది.