తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లో వాస్తు దోషంతో ఇబ్బందులా? - కర్పూరంతో ఇలా చెక్​ పెట్టండి! - vastu dosh removing tips by Camphor

How to Remove Vastu Dosh by Camphor : మెజారిటీ జనం వాస్తు ప్రకారమే ఇంటిని కట్టుకుంటారు. కానీ.. తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇంట్లో నెగిటివ్​ ఎనర్జీ వస్తుందని చెబుతారు వాస్తు నిపుణులు. అయితే.. ఈ ప్రతికూల శక్తిని తొలగించే పలు మార్గాల్లో కర్పూరం ఒకటి. మరి.. దాన్ని ఎలా ఉపయోగించాలో ఈ స్టోరీలో చూద్దాం.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 5:05 PM IST

How to Get Rid of Vastu Dosh With Camphor at Home :మెజారిటీ భారతీయులు వాస్తును బలంగా నమ్ముతారు. ఇల్లు కట్టుకోవాలన్నా.. లేదా మరేదైనా నిర్మాణం చేపట్టాలన్నా.. వాస్తు చూసిన తర్వాతే పని మొదలుపెడతారు. నిర్మాణాల విషయంలోనే కాకుండా.. ఇంట్లోని వస్తువుల విషయంలోనూ వాస్తు పాటిస్తూ పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంటికి వాస్తు సరిగా ఉంటేనే.. సుఖ శాంతులు నెలకొంటాయని.. జీవితం కూడా సజావుగా సాగిపోతుందని నమ్ముతారు. అయితే.. అన్ని పనులూ వాస్తు ప్రకారం చేసినప్పటికీ.. తెలియకుండా జరిగే చిన్న చిన్న వాస్తు దోషాల కారణంగా ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తాయని విశ్వసిస్తారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వాస్తు శాస్త్రంలో అనేక పద్ధతులు ఉన్నాయని నిపుణులు చెబుతారు. ఇందులో భాగంగా.. కర్పూరంతో దోష నివారణ చేయొచ్చని సూచిస్తున్నారు.

మీ ఇంట్లో తరచూ గొడవలా? - వాస్తు సమస్య కారణం కావొచ్చు - ఇలా చేస్తే అంతా సెట్!

కర్పూరం:సనాతన ధర్మంలో కర్పూరం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే దేవుని పూజకు కర్పూరం ఉపయోగిస్తారు. ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. శ్రేయస్సు దేవత అయిన లక్ష్మి, సంపదకు మూలపుటమైన కుబేరుడు అక్కడ నివసిస్తారని పురాణోక్తి. అంతేకాదు.. కర్పూరం వెలిగిస్తే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

కొత్త ఇంటికి పేరు పెడుతున్నారా? - ఈ వాస్తు సూచనలు పాటించాల్సిందేనట!

  • ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే.. మొదటి సంకేతంగా ఆర్థిక నష్టం ఇబ్బంది పెడుతుందట.
  • కుటుంబంలో సమస్యలు లేదా అనారోగ్యం కూడా వాస్తు దోషాలను సూచిస్తాయి.
  • ఈ వాస్తు దోషాలను తొలిగించుకోవడానికి.. నాలుగు కర్పూరం బిల్లల్ని నెయ్యిలో ముంచి ప్రతీ ఉదయం, సాయంత్రం.. మట్టి ప్రమిదల్లో వెలిగించి ఇళ్లంతా ధూపం వేయాలి.
  • అప్పుడు కర్పూరం నుంచి వచ్చే సువాసన ఇల్లు అంతటా వ్యాప్తి చెందుతుంది. తద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుందట.
  • మీ ఇంట్లోని ఏదైనా ప్రదేశంలో నిర్మాణ లోపం ఉందని మీకు అనిపిస్తే.. ఆ స్థలంలో రెండు కర్పూరం స్టిక్స్​ ఉంచాలి. అవి పూర్తిగా కరిగిపోయిన తర్వాత మళ్లీ అదే ప్రదేశంలో మరో రెండింటిని ఉంచండి. ఈ క్రమాన్ని ఇలాగే కొనసాగించండి. ఇలా చేయడం ద్వారా ఆ స్థలంలోని వాస్తు లోపం దానంతట అదే అదృశ్యమవుతుందట.
  • వాస్తు దోషంతో ఆర్థిక ఇబ్బందులు వేధిస్తుంటే.. కర్పూరం, లవంగాలు వెండి గిన్నెలో వేసి వెలిగించాలి. రోజూ ఇలా చేస్తే ఇంట్లోని ప్రతికూల ఎనర్జీ దూరమై సానుకూల ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

గుమ్మం వద్ద ఇవి పెడుతున్నారా? ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చొరబడుతుందట!

ఇంట్లో గణపతి చిత్రం ఏ దిక్కున ఉండాలి - వాస్తు చెబుతున్నది ఇదే!

ఇంట్లో ఆ జంతువులను పెంచుతున్నారా? - వాస్తు శాస్త్రం ప్రకారం ఏమవుతుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details