తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? ఈ మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు - పూర్తి వివరాలివే!

How to Reach Ram Mandir Ayodhya : జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే రామ్​లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచి భారీ ఎత్తున అయోధ్య రామున్ని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మీరు కూడా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ మార్గాల ద్వారా ఈజీగా చేరుకోండి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Ram Mandir Ayodhya
Ram Mandir Ayodhya

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 5:25 PM IST

Updated : Jan 17, 2024, 6:00 AM IST

How to Reach Shri Ram Mandir at Ayodhya :శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ దేశవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా అయోధ్య రాముని నామ స్మరణే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. జనవరి 16 నుంచి రామ్​లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. 2024, జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Ayodhya Ram Mandir Route Maps :ప్రాణ ప్రతిష్ఠ అనంతరం సామాన్య భక్తులకు ఈ నెల 23 నుంచి బాల రాముడిని(Ayodhya Bala Rama) దర్శించుకునేందుకు అధికారులు అనుమతించనున్నారు. అయితే అధిక సంఖ్యలో భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తర్‌ప్రదేశ్‌ అధికార యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మీరు కూడా అయోధ్య వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే.. ఇలా విమానాలు, బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల ద్వారా ఈజీగా వెళ్లి శ్రీ రాముని దర్శించుకోండి. ఇంతకీ ఏ మార్గంలో ఎలా వెళ్లాలి? ఎక్కడెక్కడ దిగాలి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

How to Reach Ayodhya By Flights : అయోధ్యకు చేరుకునేందుకు అనేక రాష్ట్రాలతో కనెక్టివిటీ ఉంది. ఇక విమానాల ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునే ప్రయాణికులు..

  • మీ దగ్గరలోని విమానాశ్రయం నుంచి యూపీలోని లక్నో, వారణాసి విమానాశ్రయానికి చేరుకోవాలి. ఇవి రెండూ దేశీయ విమాన సర్వీసులతో విమానాశ్రయాలను కలిగి ఉన్నాయి.
  • ఆ తర్వాత అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు.
  • అనంతరం అక్కడి నుంచి సులభంగా ట్యాక్సీ బుక్ చేసుకుని ఆలయానికి చేరుకోవచ్చు.
  • ఒకవేళ మీరు లక్నో విమానాశ్రయం నుంచి వెళ్లాలనుకుంటే.. ప్రైవేట్ ట్యాక్సీలు, ఇతర మార్గాల ద్వారా కూడా అయోధ్యకు చేరుకోవచ్చు.
  • అదే వారణాసి విమానాశ్రయానికి చేరుకున్నట్లయితే అక్కడి నుంచి రైలు, బస్సు, ట్యాక్సీ ద్వారా రామమందిరానికి రీచ్ అవ్వొచ్చు.

శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠకు అంతా రెడీ- నిత్య క్రతువుల షెడ్యూల్ ఇదే

How to Reach Ayodhya By Trains :ఒకవేళ మీరు రైలు మార్గం ద్వారా వెళ్లాలనుకుంటే..

  • మీ దగ్గరలోని రైల్వే జంక్షన్ నుంచి అయోధ్యలో ఉన్న ఫైజాబాద్ జంక్షన్, అయోధ్య జంక్షన్ అనే రెండు రైల్వేస్టేషన్లకు చేరుకోవాలి.
  • దేశంలోని నలుమూలల నుంచి ఈ స్టేషన్లకు రైళ్లు రాకపోకలు సాగించేందుకు వీలుంది.
  • ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకుని.. ఈ రెండు స్టేషన్లకు ముందుగా చేరుకోవాలి.
  • ఆ తర్వాత అక్కడి నుంచి బస్సు, ట్యాక్సీ లేదా ఇతర వాహనాల ద్వారా అయోధ్య రామమందిరానికి చేరుకోవచ్చు.

దిల్లీ నుంచి అయోధ్యకు రైళ్లు : లక్నో మెయిల్, సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్ వంటి డైరెక్ట్ రైళ్లు దిల్లీ, అయోధ్య మధ్య నడుస్తాయి. ప్రయాణం సుమారు 8-10 గంటలు పడుతుంది.

ముంబయి నుంచి అయోధ్యకు రైళ్లు :ముంబయి నుంచి అయోధ్యకు వెళ్లే రైళ్లు తరచుగా లక్నో లేదా వారణాసి వంటి ప్రధాన జంక్షన్‌లలో ఛేంజ్ అవుతుంటాయి. అంటే ఇవి కనెక్టింగ్ రైళ్లు. ఇక ప్రయాణ వ్యవధి ఎంచుకున్న నిర్దిష్ట రైలును బట్టి మారుతుంది.

కోల్‌కతా నుంచి అయోధ్యకు రైళ్లు : సీల్దా ఎక్స్‌ప్రెస్, హజార్దువారీ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్ల ద్వారా కోల్​కతా నుంచి అయోధ్యకు చేరుకోవచ్చు. ప్రయాణ సమయం సుమారు 12-14 గంటలు.

అయోధ్యలో స్థలం కొన్న అమితాబ్- 10వేల చదరపు అడుగులు ఎన్ని కోట్లంటే?

How to Reach Ayodhya By Buses : మీరు అయోధ్య రామమందిరానికి బస్సుల ద్వారా కూడా చేరుకోవచ్చు. ప్రముఖ నగరంగా పేరొందిన అయోధ్యకు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రాకపోకలు సాగించేలా రోడ్డు కనెక్టివిటీ ఫెసిలిటీ ఉంది. అలాగే ఇది జాతీయ రహదారులకు దగ్గరగా ఉంటుంది.

  • ఏదైనా బస్ బుకింగ్ యాప్ ద్వారా ఈజీగా బస్ బుక్ చేసుకుని అయోధ్యకు చేరుకోవచ్చు.
  • అలాగే ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (UPSRTC) లక్నో నుంచి అయోధ్యకు సాధారణ బస్సులను నడుపుతుంది.
  • ప్రయాణ సమయం సుమారు 4-5 గంటలు. అలాగే వారణాసి నుంచి అయోధ్య వరకు ప్రైవేట్ బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి.
  • అదేవిధంగా ప్రైవేట్ ఆపరేటర్లు దిల్లీ నుంచి అయోధ్యకు వోల్వో బస్సు సర్వీసులు నడుపుతున్నారు.
  • మిగతా బస్సుల కంటే ఇందులో వేగంగా చేరుకోవచ్చు. ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి.

టాక్సీల ద్వారా అయోధ్యకు చేరుకోండిలా..

అయోధ్యలో స్థానిక టాక్సీలు : మీరు అయోధ్య చేరుకున్న తర్వాత.. నగరంలో తక్కువ దూర ప్రయాణానికి స్థానిక టాక్సీలు, ఆటో-రిక్షాలు అందుబాటులో ఉంటాయి. అయితే మీరు అందులో వెళ్లాలనుకుంటే టాక్సీ మీటర్లు కన్ఫార్మ్ చేసుకోవాలి. లేదంటే ముందుగానే ఇంత ఇస్తామని ఛార్జీ మాట్లాడుకోవడం బెటర్. లేదంటే తర్వాత మీ నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది.

రైల్వే స్టేషన్/విమానాశ్రయం నుంచి ప్రీపెయిడ్ టాక్సీలు :అయోధ్య జంక్షన్ లేదా సమీపంలోని విమానాశ్రయాలలో.. ప్రీపెయిడ్ టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు అయోధ్యలో మీరు కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి అనుకూలమైన మార్గాన్ని అందిస్తాయి. ఇలా పైన పేర్కొన్న మార్గాల ద్వారా మీరు ఈజీగా అయోధ్యకు చేరుకుని శ్రీరాముని దర్శనం చేసుకోవచ్చు.

అయోధ్యలో టెంట్​ సిటీ సిద్ధం - ప్రముఖుల కోసం స్పెషల్ కాటేజీలు - ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

అయోధ్య రామాలయ గర్భగుడిలో ఇద్దరు బాల రాముళ్లు- కొత్త విగ్రహం తయారు చేసింది ఆయనే!

Last Updated : Jan 17, 2024, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details