How to Makes Palak Prawns Curry in Telugu : మాంసాహార ప్రియులకు సండే వచ్చిందంటే.. ఇంట్లో నాన్వెజ్ ఉండాల్సిందే. ఒక రోజు ముందునుంచే ఈ ఆదివారం ఏ నాన్వెజ్ కర్రీ చేసుకుందామని ఆలోచిస్తుంటారు. ఇక కొందరైతే ఏం వండుకుంటాంలే ఏదైనా మంచి రెస్టారెంట్ నుంచి బిర్యానీ లేదా ఏదైనా నాన్వెజ్ రెసిపీ ఆర్డర్ చేసుకుందామనుకుంటారు. అయితే.. ఈ సండే ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. అది కూడా.. రెగ్యులర్ చికెన్, మటన్ కాకుండా.. ఆరోగ్యానికి మేలు చేసే రొయ్యలు ఎంచుకోండి. అదికూడా.. పాలకూరతో కలిపి వండేద్దాం.
How to Prepare Spinach Prawns Curry : చాలా మంది చేపల కర్రీ(Fish Curry)ని ఈజీగా వండేస్తారు. కానీ ప్రాన్స్(రొయ్యల) విషయానికొస్తే కాస్త వెనకడుగు వేస్తారు. మనవల్ల కాదులే.. సరిగ్గా రాదేమోనని భావిస్తుంటారు. అలాంటి వారు, బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు కూడా మేము చెప్పేది ఫాలో అయితే చాలా సింపుల్గా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే నోరూరించే పాలక్ ప్రాన్స్ కర్రీ ట్రై చేసేయండి.. ఇంటిల్లి పాది కూర్చొని లొట్టలేసుకుంటూ లాగించండి.
Required Ingredients for Spinach Prawns Curry :
పాలక్ ప్రాన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు :
- రొయ్యలు(ప్రాన్స్)- 200 గ్రా., (పొట్టు తీసి శుభ్రం చేసుకున్నవి)
- పాలకూర తరుగు- రెండు కప్పులు
- ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరగాలి)
- పచ్చిమిర్చి- రెండు (సన్నగా తరగాలి)
- నూనె- సరిపడా
- అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు చెంచాలు
- పసుపు- చిటికెడు
- కారం, ధనియాల పొడి- చెంచా చొప్పున
- గరంమసాలా- చెంచా.
- ఉప్పు- రుచికి తగినంత
How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!.!