How To Increase Car Mileage :పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ బంక్‌కు వెళ్లిన ప్రతీసారీ వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని చాలా మంది బాధపడుతున్నారు. ధరల పరిస్థితి ఇలా ఉంటే.. కారు మైలేజ్ తగ్గిపోవడం చాలా మందిని మరింతగా బాధిస్తూ ఉంటోంది. అయితే.. చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా కారు మైలేజీని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టైర్లలో సరిపడ గాలి :కారులో ప్రయాణించే ముందు అన్ని టైర్లలో గాలి సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. టైర్లలో కంపెనీ నిర్దేశించిన మోతాదు కంటే తక్కువ గాలి ఉన్నట్లయితే.. రన్నింగ్‌లోడ్ పెరిగి మైలేజ్ భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది.
ఇంజిన్ ఆఫ్ :మీరు కారును ఒక నిమిషం కంటే ఎక్కువసేపు ట్రాఫిక్‌లో ఆపాల్సి వస్తే.. ఇంజిన్‌ను ఆఫ్ చేయండి. దీని వల్ల అనవసరంగా ఫ్యూయల్ వృథా కాకుండా చూడవచ్చు. అలాగే రోడ్డుపై ఏదైనా పని మీద కారు ఆపాల్సి వస్తే, ఇదే పద్ధతిని ఫాలో అవ్వండి.
ట్రాఫిక్ తక్కువగా ఉండే రోడ్లు :మీరు వెళ్లాలనుకునే ప్రదేశానికి ఎలా వెళ్తేట్రాఫిక్‌లోచిక్కుకోకుండా ఉంటాము? ఏ సమయంలో వెళ్తే బాగుంటుంది ? అనే విషయాలను ఆలోచించండి. దీని కోసం గూగుల్ మ్యాప్‌లో తక్కువ ట్రాఫిక్ ఉండే రోడ్లు ఏవో చెక్ చేసుకోండి.
స్థిరమైన వేగంతో :మీరు కారును డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనవసరంగా మితిమీరిన వేగంతో వెళ్లడం, అనవసరంగా బ్రేక్‌లను వేయడం తగ్గించుకుంటే మైలేజ్‌ను పెంచుకోవచ్చు. హైవేల మీద ఎక్కువ వేగంతో వెళ్లడం వల్ల సుమారు 30 శాతానికి పైగా మైలేజ్ కోల్పోతారు. అలాగే నగరంలోని రహదారులపై అనవసర బ్రేకింగ్, యాక్సిలరేషన్ కారణంగా సుమారు 5 శాతం మైలేజ్ తగ్గుతుంది.
మరింత మైలేజ్ ఇచ్చేలా మారుతి 'బడ్జెట్' కార్ అప్డేట్.. రూ.4.5లక్షలకే!