Best Tips for Grow Potatoes at Home :బంగాళదుంపలు.. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన కూరగాయలలో ఒకటి. వీటితో టేస్టీ కర్రీలు, ఫ్రై, చిప్స్, ఆలు బిర్యానీ, గ్రేవీ.. ఇంకా ఎన్నో వెరైటీలు తయారుచేసుకుంటాం. ఇక పిల్లలయితే బంగాళదుంపవంటకాలు, చిప్స్నూ మహా ఇష్టంగా తింటుంటారు. వారంలో కనీసం రెండు సార్లు అయినా వీటిని ప్రతీ ఇంట్లో వండుకుంటారు. అలాగే మిగతా కూరగాయల కంటే వీటిని ఎక్కువ కాలం కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఆలుగడ్డలు కావాలంటే మార్కెట్‌కు వెళ్లి తెచ్చుకోవాలి. అలా కాకుండా ఇంట్లోనే వీటిని పండించుకోవచ్చని మీకు తెలుసా? అందుకోసం ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం ఇంట్లోనే ఖాళీ స్థలం లేదంటే టెర్రస్ మీద ప్లేస్ ఉంటే అక్కడ ఈ టిప్స్ పాటిస్తూ ఈజీగా బంగాళదుంపలను పండించుకోవచ్చు. అది ఎలాగంటే..
సరైన విత్తనాలను ఎంచుకోవడం :ఇంట్లో బంగాళాదుంపలను పెంచాలనుంకుంటే మీరు మొదట పరిగణనలోకి తీసుకోవాల్సి ముఖ్యమైన విషయాలలో ఒకటి.. విత్తనాల ఎంపిక. ఇంటి వద్ద ఈ దుంపలను పండించడానికి సరైన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అయితే విత్తనాలు లేకుండా కూడా బంగాళాదుంపలను పండించవచ్చు. అందుకోసం మీరు కొన్ని బంగాళాదుంపలను మట్టిలో నాటి నీళ్లు పోస్తూ ఉండాలి. కొన్ని రోజులకు దాని నుంచి తెల్లటి మొలకలు వస్తాయి. అప్పుడు అవి ఇంట్లో అలుగడ్డలను పండించడానికి సహాయపడుతాయి. లేదంటే ఒకవేళ మీ ఇంట్లో తెల్లటి మొలకలు వచ్చినవి ఉంటే వాటిని డైరెక్ట్‌గా మట్టిలో పాతిపెట్టవచ్చు.
సరైన మట్టిని ఎంచుకోవడం :మీరు ఇంట్లో అలుగడ్డలు పండించాలంటే సరైన మట్టిని ఎంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఏదైనా మొక్క సరిగ్గా పెరగాలంటే నేల చాలా ముఖ్యమైనది. ఈ క్రమంలో ఇంట్లో బంగాళాదుంపలను పెంచడానికి, కూరగాయలు సరిగ్గా పెరగడానికి సరైన మొత్తంలో ఎరువులు వేయాలి. అయితే వీటి పెంపకం కోసం 50 శాతం మట్టి, 30 శాతం వర్మీ కంపోస్ట్, 20 శాతం కోకో పీట్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడు వాటన్నింటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పెద్ద కుండలో ఉంచండి.