Best Tips for Discounts on Train Tickets :దూర ప్రాంతాలకు ప్రయాణించేవారు రైలు మార్గాన్నే ఎక్కువగా ఎంచుకుంటారు. అయితే.. ఇటీవల ఇండియన్ రైల్వే(Indian Railways) శాఖ టికెట్ ధరల విషయంలో కొన్ని మార్పులు చేసింది. వీటి ప్రకారం.. రైలు టికెట్ల బుకింగ్‌పై డిస్కౌంట్ పొందవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా రైల్వే శాఖ అందిస్తోన్న ఈ టిప్స్ పాటించడమే. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ట్రైన్ టికెట్ల కోసం ఆఖరి నిమిషంలో హడావిడి పడేవారు ఎంతో మంది ఉంటారు. చివరకు అధిక ధర చెల్లించి తత్కాల్ లో కుడా టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే.. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునే వారికి రైల్వే శాఖ డిస్కౌంట్స్ ఇస్తోంది. జర్నీకి కనీసం120 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా.. సులువుగా ఒకే కోచ్‌లో అందరికీ బెర్త్ కన్ఫామ్ కావడంతోపాటు.. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా టికెట్ పొందొచ్చు.
Best 5 Train Ticket Booking Apps : ఆన్లైన్లో ట్రైన్ టికెట్స్.. బెస్ట్ యాప్స్ ఇవే!
క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ : మీరు ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు ఎల్లప్పుడూ క్యాష్‌బ్యాక్ సైట్‌లను గమనించటం ముఖ్యం. ఈ సేవను వినియోగించుకోవడం ద్వారా.. క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కొంతమేర డబ్బు ఆదా చేసుకోవచ్చు. ట్రైన్ టికెట్ బుకింగ్‌పై చాలా సైట్లు ధర తగ్గింపుతోపాటు క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తాయి. ఈ క్రమంలోనే ఇటీవల IRCTC SBIతో జాయింట్ టికెట్ బుకింగ్ కోసం ప్లాటినం కార్డ్‌ను కూడా ప్రారంభించింది. టికెట్ల బుకింగ్ కోసం వీటి ద్వారా చెల్లింపులు చేయటం ద్వారా మీరు ఆఫర్లు పొందవచ్చు.